SWAPNA SAGARAM by DR.GUJJU CHENNA REDDY Telugu book cover

SWAPNA SAGARAM

by DR.GUJJU CHENNA REDDY

₹200
In stock · 40 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696138
By Dr. Gujju Chenna Reddy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ గ్రూప్వన్ ఉద్యోగాన్ని కాదని ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ఆచార్యునిగా సేవలందిస్తున్న గుజ్జు చెన్నారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రెండు పిహెచ్.డిలు అందుకున్నారు. 215 పరిశోధక వ్యాసాలు రాసి, తన గైడెన్స్లో 42 డాక్టరేట్లు పూర్తి చేయించి డిగ్రీ, హైస్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ రాసి, తెలుగు దినపత్రికలకు కాలమిస్ట్గా, ఆలిండియా రేడియో, దూరదర్శన్లకు ఉపన్యాసకునిగా సేవలందిస్తున్న ఇతని మొదటి పుస్తక రచన “సిక్కోలు కథలు”, మొదటి నవల “మరోమహాత్మ”, రెండవ నవల "లండన్ టు అమరావతి”, మూడవ నవల ఈ “స్వప్న సాగరం”. "స్వప్న సాగరం" తెలుగు సాహిత్యంలో ద్వితీయ పురుష (Second person narration) లో రాసిన మొదటి నవల. కథానాయకుడు సాగర్ విశాఖపట్టణంలోని ప్రముఖ కళాశాలలో బి.ఏ. ఫైనల్ ఇయర్ విద్యార్థి. అతని క్లాస్మేట్ స్వప్న. బి.ఏ ఫైనల్ ఇయర్ పరీక్ష రాసి, ఎం.ఏ.లో ఆంధ్రా యూనివర్శిటీలో చేరుతారు. గ్రామీణ విద్యార్థి అయిన సాగర్ విశాఖపట్టణంలో గది తీసుకుని, పట్టణ క్లాస్మేట్స్తో పరిచయం ఏర్పడి క్లాస్మేట్ స్వప్నతో స్నేహం చేస్తాడు. ఆంధ్రాయూనివర్శిటీలో ఎం.ఏ. చేరిన తరువాత, యూనివర్శిటీని ఆనుకుని ఉన్న సాగరతీరంలో వీరి కబుర్లతో నవల ముందుకు సాగుతుంది. పట్టణ, పల్లె విద్యార్థుల అలవాట్లు, అగచాట్లు, పులకింతలు, కేరింతలు, సాగరాన సయ్యాటలు. కలల అలల మాటున స్వప్నంలా సాగిపోయే ఈ నవల “స్వప్నసాగరం” సాగర్ జీవితంలో ఒకరోజు జరిగిన సంఘటనలే. తెలుగు సాహిత్యంలో ప్రయోగాత్మకంగా నవల తొలిపుట నుండి మలిపుట వరకు పూర్తిగా మధ్యమ పురుషలో రాయబడింది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-81-976961-3-8