
SWAPNA SAKARAM
₹150
In stock · 21 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
స్వప్నసాకారం 'వాలి హిరణ్మయీదేవి' - ఈ పేరు వింటేనే ఓ ఫీల్ గుడ్ స్టోరీ కళ్ళ ముందు మెదులుతుంది. ముప్పైసంవత్సరాల క్రితం సాహితీవనంలో వికసించిన ఈ కుసుమం వెదజల్లిన సౌరభాలు ఎన్నెన్నో... చక్కని ఎత్తుగడ, సరళమైన శైలి, అలవోకగా సాగిపోయే కథనం, హృద్యమైన ముగింపు ఈమె కథకు లక్షణమైన ఆభరణాలు. ఈమె కథల్లోని పాత్రలన్నీ మన చుట్టూ సమాజంలో కనిపించేవే... ఎదురింటి బామ్మగారో, పక్కింటి పిన్నిగారో మనకి ఈమె కథల్లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే మమతలను, గొడవలను, ఆర్థిక సమస్యలను, విభిన్న మనస్తత్వాలను తన కథల్లో చర్చించే ఈ రచయిత్రి సామాజిక పరిశీలన ప్రశంసనీయం. ఆమె వ్రాసిన ఏ కథనైనా చదవటం ప్రారంభించడమే మన వంతు... ఇక ఆ కథే మనల్ని చివరివరకూ చదివింపజేస్తుంది... సామాజిక సమస్యలు, ఆర్ధిక అసమానతలు, బాంధవ్యాలు, హరించిపోతున్న విలువలు...ఇవే హిరణ్మయిగారి కథావస్తువులు... సమస్యను తీసుకోవటమే కాదు, దాన్ని గురించి చర్చించి, దానికి పరిష్కారం కూడా సున్నితంగా సూచిస్తారు రచయిత్రి తన కథల్లో. తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సాహితీ ప్రపంచంలో ఎందరో ప్రముఖ రచయిత(త్రు)ల మన్ననలను, ప్రశంసలను పొంది, మరెందరికో ఎంతో స్పూర్తిదాయకంగా నిలచిన ఈ రచయిత్రి నా స్నేహితురాలు కావటమే కాక, నాలోని 'రచయిత్రి'ని సృష్టించిన ఒక సృష్టికర్త కూడా అని చెప్పటానికి ఎంతో గర్వపడుతున్నాను. అంతేకాక తాను వ్రాసిన ప్రతీ కథకూ, నవలకూ ప్రథమ పాఠకురాలిగా నన్ను నిలిపినందుకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను... మరి అడుగుపెడదామా ఈ సుందర గ్రంథవనంలోనికి? ఆమె కథా కుసుమాల పరిమళాలను ఆఘ్రాణించేందుకు!! - శ్రీమతి నండూరి సుందరీ నాగమణి