SWARA KAVANAM by KANIGIRI GAYAJ Telugu book cover

SWARA KAVANAM

by KANIGIRI GAYAJ

₹50
In stock · 25 available
PublisherKANIGIRI GAYAJ
LanguageTelugu
కృతజ్ఞతలు నా హృదయంలో సాంస్కృతిక దీపాన్ని వెలిగించిన కీర్తిశేషులు హాస్యనట చక్రవర్తి రాజబాబు గారికి ముందుగా నా కళాభివందనాలర్పించుకుంటున్నాను. నా పాటల్ని విన్న మరుక్షణం నించీ ఆ పాటల్ని పుస్తకంగా వెలువరించమని ప్రేమగా పోరు పెట్టిన అరవింద విద్యాసంస్థల డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి, ప్రిన్సిపల్ ఇంద్రాణి గారికి, ఆత్మకూరు చెన్నయ్యగారికి, విజయవాడ విద్యార్థి స్కూల్ నిర్వాహకులు కృష్ణ, మాలతి గార్లకు, ప్రఖ్యాత మెజీషియన్ క్రాంతికార్ గారికి, డా॥ గమనం గారికి, వికాస విద్యావనం కరస్పాండెంట్ డా॥పరిమి దంపతులకు, ప్రజానాట్యమండలి రచయిత దేవేంద్ర గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నా బాల్యమిత్రుడు ప్రముఖ సంగీత చక్రవర్తి, కాబోయే దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారికి, పాటలు బాగా రాయమని, పుస్తకం చక్కగా తీసుకురమ్మని నన్ను ప్రోత్సహించిన ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి నా కృతజ్ఞతలు. భ్రమరగీతం, యశోదకృష్ణ వంటి తాత్విక గ్రంథాలు వెలువరించి 'అహల్య' అనే అద్భుత గ్రంథ రచనలో తలమునకలౌతూ కూడా నేనడిగినంతనే ఈ పుస్తకానికి తొలిపలుకులు రాసిచ్చిన మాతృమూర్తి సమానులు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి చలసాని వసుమతి గారికి, జిల్లా రచయితల సంఘం పనుల్లోనూ, వైద్యవృత్తిపరంగానూ పనుల ఒత్తిడిలో వున్నప్పటికీ నా పుస్తకాన్ని గురించి, నా పాటల గురించి నాలుగు మంచి మాటలు రాసిచ్చి, ఈ పుస్తకానికి మరింత పరిపూర్ణతను తెచ్చిన కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డా॥జి.వి. పూర్ణచందు గారికి, ఎంతో వివరణాత్మకంగా ముందుమాట రాసిచ్చిన కవి, సమీక్షకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారికి మరియు మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీగారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.