SWATANTRAM NUNDI SWATANTRYANIKI by DR.JANDHYALA KANAKADURGA Telugu book cover

SWATANTRAM NUNDI SWATANTRYANIKI

by DR.JANDHYALA KANAKADURGA

₹350
In stock · 49 available
PublisherDR.JANDHYALA KANAKADURGA
LanguageTelugu
ISBN9789359154244
ముందుమాటలు.. ఆంధ్రదేశంలో స్త్రీ చైతన్యం రూపుదాల్చి, స్త్రీలు తాము ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి ఉద్యమాలు నిర్మించడం, రచనలు చేయడం, సమాజాలు నిర్వహించడం, 19 వ శతాబ్ది చివరకే మొదలయింది. సాంఘిక సంస్కరణోద్యమాల్లో భాగంగా వీటిని విశాలార్ధంలో చూసినా, 20 వ శతాబ్ది మొదటి రెండు దశాబ్దాల కాలానికి స్త్రీల ఉద్యమాలు తమ ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. సంస్కరణోద్యమ భావజాలానికి తోడుగా జాతీయభావాలను జోడిస్తూ స్వాతంత్ర్యోద్యమమూ మొదలయింది. ఆంధ్రదేశంలో చెప్పుకోదగ్గ పరిణామం, 1920 కల్లా మహాత్ముడు జాతీయోద్యమ నాయకత్వం చేపట్టే నాటికే, స్త్రీసమాజాలు, స్త్రీ రచయిత్రులు సాహిత్యసృష్టి చేయడం, పత్రికలు నడపడం, ఉద్యమాల్లో ప్రత్యక్ష భాగస్వాములు కావడం జరిగాయి. ఈ క్రమంలో రచయిత్రుల రచనలు, ఉపన్యాసాలు, సత్యాగ్రహాలు, అరెస్టులు సరే ఆ కార్యరంగాన్ని అటుంచి, సమాంతరంగా తమ సృజనను జాతీయోద్యమంవైపుకు మళ్ళించి, విభిన్నరచనలు, ప్రక్రియలు- వ్యాసం, కథ, కవిత, జీవితచరిత్రలు - చేపట్టడం, స్థానికం మొదలు రాష్ట్ర స్థాయిలో సమాజాలను నిర్వహించడం, వార్షికసభలు జరిపి తీర్మానాలు చేయడం ముమ్మరంగా కొనసాగాయి. ఇందులో భాగంగానే, ప్రస్తుతం మీ ముందున్న గ్రంథం". స్వతంత్రత నుండి -స్వాతంత్ర్యానికి" వెలువడుతోంది. ఇదొక జమిలి ఆశయం. ఒకవైపు స్త్రీలు తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఉద్యమిస్తూ, రచనలు చేస్తూనే, మరోపార్శ్వంలో స్వాతంత్య్ర సాధన కోసం తమ కలాలకు పనిపెట్టారు. ప్రస్తుత గ్రంథం వారి రచనలను పరామర్శించి, సమీక్షించింది. తెలుగులో జాతీయోద్యమ సాహిత్యంపై సాధికారిక రచన చేసిన మద్దూరి సుబ్బారెడ్డిగారి లాంటి పరిశోధకులున్నారు. వారి రచనల్లో స్త్రీ రచయిత్రుల రచనలు నామమాత్రంగానే వున్నాయి.