T.V PRAKATANALU by VEMPALLE SHAREEF Telugu book cover

T.V PRAKATANALU

by VEMPALLE SHAREEF

₹260
In stock · 5 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9788195128105
టీవీ ప్రకటనలు ఒకవైపు ప్రపంచీకరణ, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ విధానాలు ప్రాంతీయ ప్రసార, ప్రచార మాధ్యమాలను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. లాభాపేక్షే ధ్యేయంగా వీలైనన్ని ఆకర్షణలు, హంగులతో చేతనైన అన్ని కళాప్రదర్శనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. చివరికి ప్రకటనల ముసుగులో స్థానిక, ప్రాంతీయ, జాతీయ సంస్కృతులను, భాషను కలగా పులగం చేసి వాటి స్థానంలో ఓ సరికొత్త సంకర సంస్కృతిని, భాషను తయారు చేస్తున్నాయి. నిత్యం బిజీ జీవితంలో గడుపుతున్న మనకు ఇవన్నీ అంత సులభంగా అందవు. ఇదిగో ఇలా ఎవరైనా ఒక కొత్త ప్రయత్నం చేసినప్పుడు మన కళ్లు కూడా సరికొత్తగా తెరుచుకుంటాయి. సరైన అంశంపై సరైన సమయంలో వచ్చిన సరైన పరిశీలనా గ్రంథం ఇది. తెలుగు మరియు జర్నలిజం విద్యార్థులు, పరిశోధకులతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కోరే ప్రతివాళ్లూ చదవదగ్గది. నేను ఈ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తూ, అభినందిస్తున్నాను. -దేవిరెడ్డి శ్రీనాథ్, ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమి, విజయవాడ. షరీఫ్ కడపజిల్లా వేంపల్లెలో 1980లో పుట్టారు. 20 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. పత్రి కలు, రేడియో, టీవీ, డిజిటల్ మీడియాలో వివిధ విభాగాల్లో పనిచేశారు. పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీతోపాటు ఎంఏ తెలుగు, ఎంసిజె, ఎంఫిల్, పీహెచ్ చేశారు. పలు పత్రికల్లో వ్యాసాలు, పరిశోధనా పత్రాలు రాశారు. ఇటు కాల్పనిక సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేసిన షరీఫ్ 2012లో తన కథల పుస్తకం 'జుమ్మా'కు కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందారు. ఈయన రచనలు పలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. 'జుమ్మా' కన్నడ అనువాదానికి కర్నాటక ప్రభుత్వం 'కువెంపు భాషా భారతి' పురస్కారం ఇచ్చి గౌరవించింది. 'గిడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం', 'చాసో స్ఫూర్తి పురస్కారం'తో పాటు రాష్ట్రస్థాయిలోనూ అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటిదాక మూడు కథల పుస్తకాలు ప్రచురించారు. రెండు కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు