
TAGORE GITANJALI - 160
₹160
In stock · 86 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంగారిది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” చలం 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ ఈశ్వరుని అస్తిత్వం మీద సందేహం కలిగి – “లేడో! లేడేమో!” అనుకున్న రోజుల్లో గూడ, గీతాంజలి ఏకాంత పారాయణ గ్రంథం చలానికి, కనీసం మూడు దశాబ్దాల పారాయణ ఫలితం ఈ అనువాదం. 1958లో అనువాదం అయింది. సవివరమైన విలువైన పీఠిక గూడ రాశారు. రవీంద్రుని కవితా రచనలపై అంతగా ప్రభావితం చెందించారు. ✦ ✦ ✦ “గీతాంజలి” అనువదించటానికి భాషే పాండిత్య మాత్రమేచాలదు, పరిణతి మాత్రమే సరిపోదు; అందుకు అంతరీక్షణ అవసరం, జీవన సాధన అవసరం. ఈ తెలుగు “గీతాంజలి”ని చదివితే అంతరీక్షణ, జీవన సాధన పుష్టి వారికి అనువదించినట్టుగా కనిపిస్తుంది. చలంగారి “గీతాంజలి” ఇదొక ప్రత్యేకత. – సంజీవ దేవ్