TALAPULA VEENA by CHERAKU SATYANARAYANA REDDY Telugu book cover

TALAPULA VEENA

by CHERAKU SATYANARAYANA REDDY

₹100
In stock · 2 available
PublisherCHERAKU SATYANARAYANA REDDY
LanguageTelugu
TALAPULA VEENA కాగజ్నగర్ తెలుగు సాహితీ సదస్సు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన చెఱకు సత్యనారాయణ రెడ్డిని మేము ముద్దుగా 'సనారె' అని పిలుచుకుంటాం. కవి, గాయకుడుగా ప్రసిద్ధి పొందిన రెడ్డి కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి మండలం, చెఱకు కొత్తపల్లిలో 3-4-1949న జన్మించారు. పాఠశాల విద్య కొత్తపల్లి, మంథని, కాలువ శ్రీరాంపూర్, సిరిసిల్ల, జమ్మికుంటల్లో, కళాశాల విద్య (బి.ఏ)మంచిర్యాలలో అభ్యసించారు - 1979లో ఆదిలాబాదు జిల్లా, సిర్పూర్ కాగజ్నగర్లోని సిర్పూర్ పేపరు మిల్లులో కార్మికుడుగా చేరి 2009లో పదవీ విరమణ పొందారు. చిన్ననాటనే మంచి గాయకుడుగా గుర్తింపు పొందిన 'సనారె' అనేక సభల్లో తన గాన మాధుర్యంతో శ్రోతల నోలలాడించారు. రాగాలు తీసే గొంతుకకు అనుగుణంగా పల్లె పట్టుల అందాలను పదాల్లో పొందించి సహజ సుందర గేయాలల్లటం కూడా చిన్న నాటనే అలవడినా, కాగజ్నగర్ కళాక్షేత్రంలో వన్నె వాసికెక్కింది. వీరి మొదటి పుస్తకం 'చెఱకుతోట' డా. సామల సదాశివ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. ఈయన గేయాలు హృదయస్పర్శిగా వుండి గానయోగ్యత కలిగి ఉంటాయి. అలతి పదాలలో అందమైన భావాలను పొదగడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అభినవపోతన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు వీరి గేయానికి పులకరించి ముందు మాట రాశారంటే అది కేవలం రెడ్డిగారి ప్రతిభా పాటవమే 'నవ్యపథం' అన్న పేరుతో ఆ కవితా సంపుటి అముద్రితంగా వుండి ఇల్లు మారినప్పుడు ఎక్కడో పోయింది. అలాంటి దురదృష్టమే వీరి శ్రీమతి శ్రీలత క్యాన్సర్ వ్యాధితో అకాలమరణం పాలుకావడం. సత్యనారాయణరెడ్డి గారి తల్లిదండ్రులు కీ.శే. కౌసల్య, ఇంద్రసేనారెడ్డి గారలు. వీరి కుమారుడు ప్రశాంత్రెడ్డి, కోడలు సాయిక్రిష్ణవేణి, మనుమరాలు మనన, కుమార్తె హిమబిందు చందుపట్ల-అల్లుడు ఉదయభాస్కర్ రెడ్డి చందుపట్ల, పదవీ విరమణానంతరం హైదరాబాదులో ఉంటున్నారు. సత్యనారాయణ రెడ్డిగారి కలం నుండి జాలువారిన ఏ గీతమైన వారి గళం నుండి విన్నవారు ఎన్నటికీ మరచిపోలేరు. వీరిదే మరో పుస్తకం 'భావభాస్వరం' కూడా ముద్రణలో ఉంది. వైవిధ్యభరితమైన వస్తువులను తనదైన సహజ శైలిలో గీతాలుగా అందిస్తున్న ఈ 'తలపులవీణ'ను తనువు వీడినా మనసునంటి పెట్టుకున్న అర్ధాంగికి అంకితంగా ఇచ్చి ఆమెను కృతిబద్ధం చేసిన మిత్రుడు 'సనారె' పాఠకులను తన పాటల తోటలో విహరింపచేసి ఆనందం చేకూరుస్తారని తలుస్తూ... వాధూలస