TALLI MANASU by SOMANCHI VINAYABHUSHANA RAO Telugu book cover

TALLI MANASU

by SOMANCHI VINAYABHUSHANA RAO

₹50
In stock · 165 available
PublisherSOMANCHI VINAYABHUSHANA RAO
LanguageTelugu
కౌసల్య భేదం ఆనాడు సంధ్యాకాల పూజకొనసాగిస్తూ విష్ణుమూర్తి దివ్యవిగ్రహం ముందు ధ్యానత్పరతలో కూర్చుని ఉన్నాను. మనసులో అనిర్వచనీయమైన ఆనందం పెల్లుబికి ఒడలంతా పులకించిపోతున్నాను. దానితోబాటుగా ఏదో తెలియని ఉద్విగ్నత, కలవరపాటు కలిసి అదొక వింత అనుభూతి. ఈ లోగా పూజామందిరం బైటనుండి మనుష్యుల అస్పష్టమైన అలికిడి. ధ్యానం నుండి మెలకువలోనికి వస్తున్న సూచన. నేనింకా కళ్లుతెరవబోతుండగానే నిరంతరం నా గుండెకు అద్భుతమైన ఆనందాన్నిచ్చే చల్లని పూలసుగంధంలాంటి పిలుపు వినవచ్చింది - "అమ్మా!" అని. నా రాముడు, నీలమేఘశ్యాముడు, 'వామాక్షి కౌసల్య వరసుతుడు', ఎన్నడూ నా నిత్యపూజాధ్యానాలకు విఘ్నం కలిగించని వాడు, పిలుస్తుంటే తటాలున కళ్లు తెరిచి చూశాను. ఎదుటనుండే విష్ణుస్వరూపానికి బదులు రాముడు కనిపించాడు. ఆ ప్రక్కనే రేయికి ప్రక్కన పగలులాగ లక్ష్మణుడు వింతగా ఉంది అంతా. ఎందుకొచ్చారు వీళ్లు యీ వేళ, యీ అసమయ ఘడియలో? మహారాజు దశరథుడు ఆ రోజల్లా సభాభవనంలోనే ఉండిపోయాడు. ఇంటి బయట వాతావరణంలో ఏదో కలకలం, ఘోష, నాకు యివేమీ పట్టవుగా! ఆయన గూడా నా మందిరాన్ని పావనం చేసేది అరుదుగానే. మా ముగ్గురు మహారాణులలో మధ్యది అయిన తన ప్రియభార్య కైక మందిరానికే ఆయన అంకితం. నాకు రేయింబవళ్లు భగవద్ధ్యానంతోనూ, గృహకార్యాలతోనూ కాలక్షేపం. పిల్లలిద్దరి వైపు చూసి వారిముఖాల్లో ఒక మందస్మితరేఖ కనబడి దేవుడికి ఒక నమస్కారం చేసి లేచాను. "ఏమిటి నాయనా, అకాల ఆగమనం? ఏమిటి విశేషం?" అని రాముణ్ణి అడిగాను. దానికి రాముడు సమాధానం యిచ్చేలోగా వెంటవున్న లక్ష్మణుడు ముందుకువచ్చి అత్యుత్సాహంతో, 'పెద్దమ్మా, శుభవర్తమానం. నాన్నగారు యీనాటి సభలో మంత్రుల, సామంతుల, గురువుల, బ్రాహ్మణోత్తముల, ప్రజాప్రతినిధుల సమక్షంలో వారందరి సమ్మతితో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అన్నయ్యకు యౌవరాజ్య పట్టాభిషేకం. ఎప్పుడనుకున్నావ్? రేపే. అన్నయ్యకు కబురుచేసి ఈ శుభవార్త తెలిపి రేపటి కార్యక్రమానికి సిద్ధం కమ్మని చెప్పారు. నీకు, మా అమ్మకు వర్తమానం పంపుతున్నారు. ఈలోగా మేమిద్దరం మీ ఆశీస్సులకై ముందుగా వచ్చాం" అన్నాడు ఊపిరి తిప్పుకోకుండా, వారిస్తున్న అన్నను స్నేహపూర్వకంగా ప్రక్కకు త్రోసి. నాకు ఆనందాతిరేకంలో మాట రాలేదు. క్రింద పడిపోయాను. వెంటనే రాముడు ముందుకు వచ్చి నా వెన్ను నిమిరి ఎత్తి నన్ను నిల్చోబెట్టాడు. నా పాదాలకు ఎరిగి వందనం చేశాడు. లక్ష్మణుడు వంత పాడాడు. నేను రాముణ్ణి గాఢ