
TALLI NINNU DHALANCHI H.B
₹375
In stock · 2 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN03110
ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దైవికమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేడో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం. భక్తకవి అస్తిత్వవేదన నిజం. ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని మనం తక్కువ చేసి చూడనక్కరలేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించడానికి అడ్డం కాబోదని నా అవగాహన. డా॥ పాపినేని గత సాహిత్యంలో జీవధాతువుగల అమూల్య పద్యబీజాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబంధాల్ని మౌలికంగా నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్థులు మొదలు గృహస్థుల దాక జీవనకళ నేర్పుతాయి. జీవిత సంస్కారాన్ని పండిస్తాయి. అంతిమంగా ఒక ఆరోగ్యదాయకమైన వ్యక్తిగత, సామాజిక సంస్కృతిని పాదుగొల్పుతాయి. సమకాలీనత గల అటువంటి రచనలను శోధించి, వివరంగా విశ్లేషించి, భాషా సాహిత్యాభిమానులకు పరిచయం చేస్తుంది ఈ గ్రంథం. 260 పద్యాలు, 50 శ్లోకాలు. 25 గేయ, కవితలతో తెలుగు సాహిత్య సాంస్కృతిక విశాల చిత్రాన్ని ప్రదర్శిస్తుంది ఈ గ్రంథం. కవులకు, రచయితలకు, విద్యార్థులకు భాషాభిమానులకు పెన్నిధి. కథ, కవిత, విమర్శ రంగాల్లో 'సాహితీ త్రిముఖుడు'గా పేరొందిన అగ్రశ్రేణి రచయిత డా|| పాపినేని శివశంకర్. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషా సాహిత్యాలపై సమానాధికారం గల శివశంకర్ ప్రాచీన సాహిత్యం అన్వేషించి చేసిన ఈ విశ్లేషణలు అమెరికాలో వెలువడే 'తెలుగునాడి' పత్రికలో ధారావాహినిగా సాహిత్యాభిమానులను అలరించాయి.