
TALLI PREMA - 50
₹50
In stock · 612 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రయత్నం మతంగుని ఆశ్రమంలో శాస్త్ర పాఠాలు నేర్చుకునే నిమిత్తం చేరిన విక్రమసేనుడు వాటిని అప్పచెప్పలేక ఒక రోజున మతంగునితో "గురువర్యా! నాకు మీరు చెప్పే శాస్త్ర పాఠాలు అర్ధమవుత న్నాయి. కానీ వాటిని తిరిగి మీకు చెప్పలేకపోతున్నాను” అన్నాడు. ప్రతీ రోజూ నువ్వు, నేను చెప్పే శాస్త్ర పాఠాలు మననం చేస్తున్నావా?” ప్రశ్నించాడు మతంగుడు. " "ప్రతీ రోజూ మీరు చెప్పే శాస్త్ర పాఠాలు ఒకటి, రెండుసార్లు చూస్తున్నాను. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోతోంది” అన్నాడు విక్రమసేనుడు. మతంగుడు చిన్నగా నవ్వి విక్రమసేనుడిని తన వెంట రమ్మన్నాడు. విక్రమసేనుడు మతంగుడిని అనుసరించి నడిచాడు. ఇద్దరూ చంపావతి నది చెంతకు వచ్చారు. ఆ నది ఒడ్డున రకరకాల పూల మొక్కలున్నాయి. మతంగుడు ఒక గులాబీ పువ్వును తెంపి నదిలోనికి విసిరాడు. ఆ గులాబీ పువ్వు నది మధ్యలో తేలసాగింది. మతంగుడు ఆ పువ్వును విక్రమసేనునికి చూపిస్తూ "విక్రమసేనా! నువ్వు వెళ్లి ఆ పువ్వును తీసుకుని రా” అన్నాడు. విక్రమసేనుడు వెంటనే నది లోనికి గెంతాడు. అలా గెంతగానే గులాబీ పువ్వు మునుముందుకు కదలసాగింది. విక్రమసేనుడు ఎంతగానో ప్రయత్నించి ఆ పువ్వును తెచ్చి మతంగునికిచ్చాడు.