TANGUTURI PRAKASAM PANTHULU SANKSHIPTA JEEVITHA CHARITRA by REDDY RAGHAVAIAH Telugu book cover

TANGUTURI PRAKASAM PANTHULU SANKSHIPTA JEEVITHA CHARITRA

by REDDY RAGHAVAIAH

₹40
In stock · 17 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రజానాయకుడు ప్రకాశం * ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితచరిత్ర భయం ఎరుగని బాలుడు నెల్లూరు జిల్లాలో నాయుడుపేట అనే ఊరువున్నది. ఆనాడు అది చుట్టుపక్కలనున్న గ్రామాల కంటే కాస్త పెద్ద గ్రామం అక్కడ ఒక హైస్కూలు ఏర్పడింది. అక్కడ ఇంగ్లీషు నేర్పేవారు. ఆ స్కూల్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు. ఒకసారి ఎందుకు వచ్చిందో సూర్యనారాయణ అనే ఇంకో అబ్బాయితో తగవు వచ్చింది. సూర్యనారాయణ పెద్దవాడు. అదే స్కూలులో పెద్దక్లాసు చదువుతున్నాడు. సూర్యనారాయణ పదిమంది ముందు ఆ అబ్బాయిని తూలనాడాడు. పైగా కొట్టాడు. ఆ అబ్బాయికి అవమానం కలిగింది. మరునాడు సూర్యనారాయణ ఇంగ్లీషు పుస్తకం ఎవరూ చూడకుండా ఆ అబ్బాయి తీశాడు. ఆ ఊరి పక్కనే సువర్ణముఖి నది వున్నది. ఆ నది ఒడ్డునే ఆ పుస్తకాన్ని ముక్కలు ముక్కలుగా చించివేశాడు. ఆ విధంగా ఆ పుస్తకం చించివేయటం ఇంకో అబ్బాయి చూశాడు. ఆ అబ్బాయి వెళ్లిపోయిన తరువాత ఆ ముక్కలన్నీ తీసుకుపోయి హెడ్మాస్టరుకు చూపించాడు. అసలే ఆ అబ్బాయి అంటే హెడ్మాస్టరుకు కోపం.. ఇంకేం! అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అతడిని బాగా కొట్టాడు. స్కూలునుండి డిస్ మిస్ చేశాడు. ఈ సంగతి ఆ అబ్బాయి తండ్రికి తెలిసింది. లబోదిబోమంటూ డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గరకు పిల్లవాడిని తీసుకువెళ్లి మొరపెట్టుకున్నాడు. ఆయన అసలు ఏంజరిగిందో అడిగి తెలుసుకున్నాడు. ఆ అబ్బాయి