
TARATARALA TELUGU - 1 - VISESHAMSALU
₹160
In stock · 3 available
PublisherCHEEKOLU SUNDARAIAH
LanguageTelugu
మనసులో మాట సంబంధాలు, పరిచయాలు కలుగుతూనే ఉంటాయి. కానీ అవి సుదీర్ఘకాలం నిలవడం, కొనసాగడం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. నే సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ శ్రీ చీకోలు సుందరయ్యను చూశాను. తను అప్పుడు 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో వారం వారం 'రంగ తరంగం' పేరుతో ఒక కాలమ్ రాస్తూ ఉండేవాడు. సాంస్కృతిక కార్య క్రమాలలో ఎక్కువభాగం రవీంద్రభారతిలో జరుగుతుండటం, సాంస్కృతిక వ్యవహారాల శాఖ పక్షాన కూడా పలు కార్యక్రమాలు ఏర్పాటు అవుతుండటం వలన నాకు పత్రికల మిత్రులతో పరిచయాలు బాగానే ఏర్పడ్డాయి. శ్రీచీకోలు ముందరయ్య ఏ.జి. ఆఫీసులో ఒక ఉద్యోగిగా, 'రంజని' అధ్యక్షుడిగా ఉంటూనే తన తీరిక వేళల్లో పత్రికలతో అనుబంధం కొససాగించాడు. ఒకవైపు నన్ను 'రంజని' కార్యక్రమాలకు ఆహ్వానించేవాడు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల మీద నిర్మాణాత్మకమైన తన అభిప్రాయాలను ఏవిధమైన సంకోచం లేకుండా వెలిబుచ్చేవాడు. సాంస్కృతికశాఖ ఒకటి రెండు సందర్భాలలో తను వెలిబుచ్చిన అభిప్రాయాలను స్వీకరించింది. అలా పత్రికల మిత్రులలో శ్రీసుందరయ్యతో నాకు పరిచయం గాఢమైంది. రంజని పక్షాన పుస్తక ప్రచురణలో ఆర్థిక సాయాన్ని ఆశించిన సందర్భాలలో నావంతు సహకారం అందించాను. దీనివలన కూడా తను చాలా దగ్గరయ్యాడు. నా పదవీ విరమణకు ముందు ఒకరోజు నన్ను కలిసి, 'మీరు అనుమతిస్తే, చీకోలు సుందరయ్య