TARIGONDA VENGAMAMBA SRI VENKATACHALA MAHATYAMU PARISEELANA by DR.S.RADHIKA Telugu book cover

TARIGONDA VENGAMAMBA SRI VENKATACHALA MAHATYAMU PARISEELANA

by DR.S.RADHIKA

₹120
In stock · 6 available
PublisherDR.S.RADHIKA
LanguageTelugu
అధ్యాయం - ఒకటి తరిగొండ వెంగమాంబ జీవితం సాహిత్యం తరిగొండ వాస్తవ్యులు, నందవరశాఖీయులు, వశిష్ఠగోత్రులు అయిన కావాల కృష్ణయామాత్యుడు, మంగమాంబ అనే దంపతులకు క్రీ.శ.1730 ప్రాంతంలో వెంగమాంబ జన్మించింది. దైవచింతనకు, సదాచార సంపదకు పుట్టినిల్లైన ఆ ఇంటిలో ఆ బాలికకు సహజమైన దైవభక్తి అలవడింది. తరిగొండ లక్ష్మీనృసింహుడు, తిరుపతి మొకటరమణుడు మొదలగు దేవతల కథలతో గాథలతో కూడిన ఆటపాటలతో మొగమాంబ శైశవం అల్లారు ముద్దుగా ఆనందదాయకంగా గడిచింది. వెంగమాంబ అక్షరాభ్యాసం మొదలుకొని సాహిత్య శిక్ష వరకు గల విద్యవంతటిని బాల్యంలో సహజంగానే నేర్చుకుంది. భక్తితో పాటలు పాడుతూ దేవతార్చనకు కావలసిన పూజాద్రవ్యాలను ఆసక్తితో అందించటం మొదలగు వాల్యా చేష్టలకు తల్లిదండ్రులు సంతోషించినారు. వెంగమాంబ రాను రాను ఉన్మయత్వంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ మైమరచిపోయే స్థితికి చేరుకొంది. తోటి బాలికలను వీడి ఒంటరిగా పరధ్యానంలో కాలం గడిపేది.