
TATAYYA CHEPPINA NEETHI KATHALU - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812133
మాటకారినక్క... అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉన్నది. అది చాలా మాటకారి. తన మాటల చాతుర్యంతో ఎదుటి వారిని బోల్తా కొట్టిస్తూ ఉండేది. ఒకనాడు దానికొక కుందేలు కనిపించింది. ఆ కుందేలుతో నక్క సంతోషంగా “నాకు పెళ్లయింది తెలుసా ?" అని అన్నది. "సంతోషం... నీవు చాలా అదృష్టవంతుడివి" అన్నది కుందేలు . “అంత అదృష్టం కాదులే... నా భార్య మంత్రగత్తె చాలా దుష్టురాలు" అంది నక్క “అయ్యో! ఎంత దురదృష్టం" - అని కుందేలు విచారం ప్రకటించింది. "అంత దురదృష్టం కాదులే... నేను ఉండటానికి నా భార్య మంచి ఇల్లు ఇచ్చింది" - నక్క చెప్పింది.