
TEEGALAGE BHARYA
₹99
In stock · 4 available
PublisherS.R PUBLICATIONS
LanguageTelugu
హాస్యబ్రహ్మగా ప్రఖ్యాతి వహించిన శంకరనారాయణ అంతర్జాతీయ కళాకారులు, ప్రముఖ పాత్రికేయులు. తన హాస్యావధానంతో లిమ్కాబుక్ రికార్డ్స్ లో రెండుసార్లు స్థానం సంపాదించుకున్నారు. పాత్రికేయరంగంలో 34 సంవత్సరాల పాటు వివిధ పత్రికల్లో వివిధ సంపాదక హోదాల్లో పనిచేసిన శంకరనారాయణ ఈనాడులో సీనియర్ చీఫ్ సబ్ ఎడిటర్గా పదవీ విరమణ చేశారు. దేశవిదేశాలలో 381 హాస్యావధానాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఫన్లైన్, ఫన్దేహాలు, పన్ పరాగ్, శంకరనారాయణ అప్రస్తుతప్రసంగాలు, అగ్నిసంగీతం, నవ్వే నజరానా, మీ నవ్వు మీ ఇష్టం, కనకదుర్గ శతకం, తీగలాగిన భార్య, ఇంగ్లిష్కు తల్లి తెలుగు వంటి ఎన్నో రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, కమలాకర ట్రస్టు జీవిత సాఫల్య పురస్కారం, టాస్టిక్స్ (డల్లాస్ - అమెరికా) అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. టెలీఫన్ (టీవీ సీరియల్); ప్రతిరోజూ సీటీవీలో విట్నెస్; సప్తగిరి ఛానల్ (దూరదర్శన్) లో నవ్వుల సవాల్ నిర్వహిస్తున్నారు.