TELANGANA INTI VANTALU NON VEG by JYOTI VALLABOJU Telugu book cover

TELANGANA INTI VANTALU NON VEG

by JYOTI VALLABOJU

₹150
In stock · 24 available
PublisherJ V PUBLICATIONS
LanguageTelugu
అచ్చంగా అమ్మ చేతివంట ఇంటికి చుట్టాలొచ్చారా కోళ్లకు గింజలేయమనే దగ్గర్నుంచి, బయటకెళ్లి బిర్యాని పార్సెల్ తెచ్చుకునేంతవరకూ మార్పు వచ్చి ఉండొచ్చు. కానీ మాంసాహార వంటకాలపై మక్కువ మాత్రం తెలుగువారికి ఎప్పుడూ వేడిగానే ఉంటోంది. కుర్చీలకు అతుక్కునే ఉద్యోగాల వల్ల, శారీరక శ్రమ పెద్దగా ఉండని జీవనం వల్ల కొవ్వూ, కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో అనే కొన్ని భయాలు హైకాలరీ ఫుడ్కి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయి. కానీ నిజానికి అనారోగ్య కారణం అదనంగా వాడే మసాలాలూ, నూనెలేనని విజ్ఞానశాస్త్రం చెపుతోంది. ఏదేమన్నా నీచంటూ దూరంగా పెడుతున్నది కొంత శాతమే! ఆహారంలో ప్రధాన భాగంగానే కాకుండా రుచికరమైన వంటకాలుగా ఎక్కువ శాతంలో ఉండేది మాత్రం మాంసాహారమే. అంతేకాదు చాలామందికి ఇష్టమైన వంటకాల చిట్టాలో తప్పకుండా ఒక్క రకమైనా మాంసాహార పదార్థం ఉండి తీరుతోందంటూ సర్వేలు చెపుతున్నాయి. మహాభారతం, అనుశాసన పర్వం 88వ అధ్యాయంలో శ్రాద్ధకర్మల (పితృ కార్యముల) సమయంలో పితృదేవతలను సంతోషపెట్టేందుకు వారికి ఏమి సమర్పించాలని ధర్మరాజు భీష్ముడిని అడిగితే శాకాహార పదార్థాలను కొన్ని చెప్పి వాటితో పాటు చేపలు ఇంకా ప్రీష్ణ అనబడే దుప్పి మాంసం, రురు (Ruru), గవయ (Gavaya) లాంటి జంతుమాంసాలు సమర్పించవచ్చునని చెప్పడాన్ని గమనిస్తే చాలా పూర్వం నుంచే ఆహారపు అలవాట్లలోనే కాకుండా పితృ సంతర్పణలలో సైతం మాంసాహారం వాడేవారనేది అర్ధం చేసుకోవచ్చు. భక్తకన్నప్ప శివుడికి భక్తిగా తాము ఆహారంగా తీసుకునే పచ్చిమాంసాన్ని కూడా నైవేద్యంగా పెట్టేవాడట. ఖురాన్ లో "ఓ విశ్వాసురాలా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిక మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మీకు తెలుపబడిన పశువులు తప్ప!" అంటూ చెప్పబడింది. మాంసాహారానికి అడ్వర్టయిజుమెంటులాగా ఇన్ని ఉదాహరణలు అవసరంలేదేమో కానీ ఈ ఆనవాయితీ మన సంస్కృతిలో తరాలుగా వేళ్లూనుకునే ఉన్నదని మరోసారి చెప్పటమే నా ఉద్దేశం. అస్సలు జ్యోతి వలబోజు