
TELANGANA INTI VANTALU VEG
by VALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
₹150
In stock · 11 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
షడ్రుచులు - తెలంగాణా ఇంటి వంటలు (వెజ్) చిన్నమాట బహుశా 2007లో అనుకుంటాను, నేను తెలుగులో బ్లాగు రాయడం మొదలు పెట్టి, మిగతా బ్లాగులతో బ్లాగరులతో మెల్లమెల్లగా పరిచయాలు పెంచుకుంటూ ఉండగా, ఒక బ్లాగులో చూశాను ఒకేసారి ఆరు బ్లాగులు నిర్వహిస్తూ, అన్నిటిలో కలిపి వెయ్యి టపాలు ప్రచురించిన జ్యోతక్కకి అభినందనలు అని. చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్క బ్లాగులో ఒక్కొక్క టపా రాసేందుకే నాకు మూడు చెరువుల నీళ్ళు తాగినట్టుగా ఉన్నదే! ఏకకాలంలో ఆరు బ్లాగులు నిర్వహించడమా? వెరసి వెయ్యి టపాలా? ఈ ఆశ్చర్యంలో ఇలా మునిగి తేలుతుండగా, అక్కడ వెల్లువెత్తిన పాఠకుల అభిమానం నా ఆశ్చర్యాన్ని ద్విగుణీకృతం చేసింది. ఎవరబ్బా ఈ జ్యోతక్క అని కుతూహలం. ఆ తరువాత ఎప్పుడో ఒక సంభాషణలో (ఈ సంభాషణలన్నీ అంతర్జాలంలోనే జరుగుతుండేవి. జాల పరిచయమైన సుమారు నాలుగేళ్ల తరువాత మేము ముఖాముఖి పలకరించుకోవడం) ఆమె, "నాలాంటి సాధారణ గృహిణులకు..." అని ఏదో చెప్పబోయారు. దానికి నేను, "ఒక్క నిమిషం అక్కడే ఆగండి. సాధారణ గృహిణి అంటూ వేరే రకం గృహిణి లేదు. గృహిణులందరూ అసాధారణులే. ఎందుకంటే అనేక రకాలుగా ఇంటినీ, కుటుంబాన్నీ చక్కదిద్దుకోవడం సాధారణమైన పని కాదు," అని చెప్పాను. ఆ మాట ఆమెకి నచ్చింది. ఐతే ఇది మన కుటుంబాల్లో ఇరవై ముప్ఫై ఏళ్ల కిందట జరుగుతుండిన సర్వసాధారణమైన కథ. ఆడపిల్ల అప్పటిదాకా ఏమి చదువులు చదివినా, ఎటువంటి ప్రతిభ ఉన్నా. పెళ్ళయినాక ఆమె జీవితం తన కుటుంబానికి అంకితం. ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచి పోయినట్లు చాలామంది మధ్య తరగతి మహిళలు తమకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నదనే విషయాన్నే మరిచిపోతుంటారు. వారందరిలాగానే తన పిల్లల భవిష్యత్తే తనకి అతి ముఖ్యమైన విషయమని భావిస్తూ, వారి ఉన్నత విద్యకి సంబంధించిన వివరాలు సేకరించడానికే జ్యోతి కూడా అంతర్జాలంలో ప్రవేశించారు. ఆ ప్రవేశించడం ఒక అద్భుతమైన ఊహా ప్రపంచానికి తలుపు తెరిచినట్లుగా అయింది. ఈమెయిలు, ఇంటర్నెట్ గుంపులు, బ్లాగులు వరసగా పరిచయమైనాయి. జ్యోతి వలబోజు