TELANGANA JAITRAYATHRA by GHANTA CHAKRAPANI Telugu book cover

TELANGANA JAITRAYATHRA

by GHANTA CHAKRAPANI

₹200
In stock · 2 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
అమరులు అలిశెట్టి ప్రభాకర్, భూమిపుత్రుడు వీరన్న సాహచర్యం, రాడికల్ ‘అవగాహన' క్యాంపస్లో చక్రపాణిని విద్యార్థిగా తీర్చిదిద్దితే, 'జీవగడ్డ' విజయకుమార్, అల్లం నారాయణలు పత్రికా రచనలో పాఠాలు చెప్తే కరీంనగర్ కదనరంగం, సామాజిక జీవన నేపథ్యం, ఆ మట్టిలో పుట్టిన మానవశాస్త్ర ప్రతిభాశాలిని ఎట్లా మలచగలవనడానికి 'తెలంగాణ జైత్రయాత్ర'యే అక్షర సాక్ష్యం. ఇంచుమించు రెండేళ్లపాటు 2011 జూలై 5 నుంచి 2013 మార్చ్ 1 వరకు 'ఘంటాపథం' శీర్షికతో ఆయన 'నమస్తే తెలంగాణ'లో రాసిన వ్యాసాలు ఒక ఏడాది తర్వాత తెలంగాణ సాకారమవుతున్న తరుణంలో వెలువడుతున్నాయి. ఇవి కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోని సంఘటనల క్రానికల్స్ కావు. విశ్లేషకులు, వ్యాఖ్యలు, మార్గదర్శకాలు, విమర్శలు, ప్రశంసలు, పరిశీలనలు - ఏమైనా కావచ్చు. కానీ వీటన్నింటికీ ఒక తాత్విక భూమిక ఉన్నది. అది తెలంగాణ పునర్నిర్మాణానికి అజెండానిస్తుంది. తెలంగాణ రాజకీయ సంప్రదాయానికి భిన్నమైన ఆత్మహత్యలకు యువతరం పాల్పడుతున్నప్పుడు ఆయన ఆదివాసులు, అందులోను దండకారణ్యంలోను గోండులు చూపుతున్న పోరాట మార్గాన్ని ఎత్తిపడతాడు. (బస్తర్ బిడ్డలకు బాసటగా నిలబడుదాం). జెఎసిలో భాగమైన ప్రతిష్ఠ పొందచూసిన మోడిత్వ రాజకీయాలను మహబూబ్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్దాక్షిణ్యంగా కడిగి పారేస్తాడు.