TELANGANA PORATA SMRUTULU - 60 by ARUTLA RAMACHANDRA REDDY Telugu book cover

TELANGANA PORATA SMRUTULU - 60

by ARUTLA RAMACHANDRA REDDY

₹60
In stock · 119 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నా రాజకీయ ప్రవేశం నేను 1909 లో నల్లగొండజిల్లా భువనగిరి తాలూకా కొలనుపాకలో జన్మించాను. ఆ రోజుల్లో గ్రామంలో ఒకే పంతులుగల జాగీరు పాఠశాలలో పల్లెటూరి చదువు చదివాను. 17 సంవత్సరాలున్నప్పుడు గ్రామానికి ఉన్నత విద్యావంతు లొకరువచ్చి ప్రైవేటు చదువు చెప్పేవారు. నేను, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి ఎ.బి.సి. ల ఆరంభంతో ఒక సంవత్సరం కొలనుపాకలోనే వారివద్ద చదివి, 1926 లో భువనగిరిలోగల మాధ్యమిక పాఠశాలలో ఫస్టుఫారంలో చేరాం. నా తల్లి తండ్రి నన్ను భువనగిరిలో చదువుటకు అంగీకరించలేదు. వారికి తెలియకుండానే భువనగిరి చదువుకై వెళ్ళి వచ్చాను. తరువాత చదువుకోటానికి అన్ని సదుపాయాలు కలుగజేశారు. భువనగిరి మాధ్యమిక పాఠశాలలో ఫస్టు, సెకండ్ ఫారాలు చదువు ముగించుకొని హైదరాబాదు గోషామహల్ మిడిల్ స్కూలులో థర్డ్ ఫారంలో చేరి 1928 సం||లో పాసైనాను. హైదరాబాద్లో గల రెడ్డి బాలురవసతిగృహంలోచేరి నాంపల్లి హైస్కులులో 1930 లో మెట్రిక్ పరీక్షలో ఫస్ట్ క్లాసులో పాసైనాను. నేను సెలక్షన్ పరీక్షలో పాసుకాలేదని ఫైనల్ పరీక్షకు పంపుటకు హెడ్మాస్టర్ అపివేశాడు. నాకన్న తక్కువ మార్కులు వచ్చిన ఒకరిద్దర్ని ఫైనల్ పరీక్షకు పంపుచున్నట్లు నోటీసు బోర్డుపై పేర్లు ప్రకటించగా నేను హెడ్మాస్టర్ మోటారు కారుముందు సత్యాగ్రహంచేసి పరీక్షకు పంపగలనని ప్రకటించిన తరువాత పక్కకు వెళ్ళాను. సత్యాగ్రహంచేసి పరీక్షకు వెళ్ళి పరీక్షలో తప్పిపోతే అగౌరవమని కష్టపడి చదివి ఫస్ట్ క్లాసులో వచ్చాను. 1930 ఏప్రిల్ దండి సత్యాగ్రహం ఆరంభమైంది. దేశమంతట జాతీయోద్యమం వాయువేగంతో వ్యాపించింది. ఆరోజుల్లోనే వీరవిప్లవ కారులైన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్లు ఉరికంబాల కెక్కి ప్రాణత్యాగం చేశారు. కామ్రేడ్స్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ఉప్పు సత్యాగ్రహం చేయుటకు కాకినాడ వెళ్ళారు. భగత్ సింగు తదితరులను ఉరికంబాలకు బలిచేసిన రోజుల్లో హైద్రాబాదులో బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వదేశీ లీగ్ పేరుతో బహిరంగసభలు వికాజీ హోటలు (ఆబిదోపు) ఆవరణలో జరిగేవి. జాతీయ ఉద్యమ ప్రభావం నాపై పడింది. నేను ఖద్దరు ధారినై తకలీపై దారముతీస్తూ బజారులో నడుస్తూ, ఊరేగింపులందు పాల్గొనేవాడ్ని గాంధీని ఒక ఆదర్శ నాయకునిగా గుర్తించి వారిలో గల గుణగణాలను అలవర్చుకొనుటకు తీవ్రకృషి చేసేవాడ్ని. రెండవ యుగములో ప్రవేశించానని, ఓ జీవితాన్ని బాగుపరచుకున్నానని గర్వపడేవాడ్ని. నా దృష్టిలో గాంధీ, వివేకానంద, దయానంద సరస్వతి, (ఆర్య సమాజ్) ఆదర్శ పురుషులు. తెలంగాణా పోరాట షృతులు ఆరుట్ల రామచంద్రారెడ్డి