
TELANGANA SAHITYAM TELUGU SAHITHIMURTHULU
by D.RAMALINGAM
₹50
In stock · 320 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డి. రామలింగం (1924) 58 - 1993 ລ້ລ້ 3) లబ్ద ప్రతిష్ఠులైన సారస్వతేయులు డి. రామలింగం గారిది కథానికా విశ్లేషకుడిగా పెద్దపేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రులు, తెలుగులో డిస్టింగ్టన్ తెచ్చుకున్న తెలివైన విద్యార్థి. జాతీయోద్యమంలోనూ, నిజాం వ్యతిరేకోద్యమంలోనూ, ఎంతో చురుకుగా పాల్గొన్న యువకులు. ఆనాటి 'సారధి' 'గోలకొండ' పత్రికలలో సహ సంపాదకుడిగా పనిచేస్తూ, తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సమాచారశాఖ ఉద్యోగిగా, మద్రాసు (చెన్నై)లో డిప్యూటీ సెన్సార్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరి కథా సంపుటి 'కాగితపు పడవలు' దేశీప్రచురణాలయం 1964లో ప్రచురించింది. రేడియో నాటికలు విరివిగా రాశారు. ఎన్నో జీవిత చరిత్రలు రాశారు. ద హిందూ, ఇండియన్ లిటరేచర్ పత్రికలలో ఇంగ్లీషు వ్యాసాలు ప్రకటించారు. చాలాకాలం కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా సంఘ సభ్యులు. ఈ వ్యాసాలు సాహిత్యాభిమానులకే కాక, పరిశోధకులకు, విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. VPH01100565