TELANGANA SAYUDHA PORATA YODHUNI KATHA by GHATANA MUDRANA Telugu book cover

TELANGANA SAYUDHA PORATA YODHUNI KATHA

by GHATANA MUDRANA

₹70
In stock · 43 available
PublisherGHATANA MUDRANA
LanguageTelugu
ముందుమాట తెలంగాణ మట్టి చరిత్ర 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అన్నాడు మహాకవి దాశరథి. అదిగో అటువంటి తెలంగాణ మట్టిలోని ఒక రత్నాన్ని 'ఒక సాయుధ పోరాట యోధుడికథ' పేరు మీద బండ్రు నర్సింహులు గారి జీవిత కథను మిత్రుడు ప్రముఖ రచయిత పి. చంద్ మన ముందు నిలిపారు. పి. చంద్ గురించి సాహితీ లోకానికి కొత్తగా చెప్పేది ఏమీలేదు. ప్రజల పక్షం వహించి, ప్రజల ఆరాట పోరాటాలను ఆకాంక్షలను నవలలుగా, కథలు మలిచి సమకాలీన ప్రజా ఉద్యమాల చరిత్రను మనముందు నిలిపిన శ్రామిక వర్గరచయిత. తెలంగాణ మట్టిలో ఏదో మహత్తర శక్తి ఉంది. అది అత్యంత సామాన్య వ్యక్తులను అసమాన పోరాట యోధులుగా తీర్చిదిద్దుతుంది. ఏ ఆధిపత్యానికి, ఏ అన్యాయాలకు, ఏ దోపిడిని సహించని ఒక ధిక్కారస్వరాన్ని, న్యాయం కోసం అసమాన త్యాగాలతో రాజీలేని పోరాటం చేసే త్యాగదనులతో తెలంగాణ పరిపుష్టమైంది. అందుకేనేమో ఆ మట్టి పరిమళాలు ఆనాటి మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రాజకీయాలు నుండి నేడు దేశ వ్యాపితంగా ప్రజలకు విముక్తి మార్గం చూపుతున్నది. ప్రజల ప్రత్యామ్నాయ ఆర్థిక సామాజిక వ్యవస్థకై పోరాడుతుంది. బండ్రు నర్సింహులు గారి జీవిత కథ చదువుతుంటే... అక్షరం ముక్కరాని ఒక వెనుకబడిన కులంలో పుట్టిన ఒక పేద యువకుడు 'నీ బాంచెన్ దొర