
TELANGANA SAYUDHA PORATAM NAA ANUBHAVALU
₹85
In stock · 201 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెలంగాణా సాయుధ పోరాటపుకాలంలో ప్రజలు పాడుకున్న విప్లవ గీతం ఇది. జిల్లా నర్సింహులు అంటే అ రోజుల్లో మా జనగామ ప్రాంతంలోని దేశముఖులకు హడల్. నిజాం పోలీసులకు సింహస్వప్నం. సర్కారుకు గుండెదడ. జనగామ తాలూకాలోని కడవెండి ఈతని స్వగ్రామం. ఈ పాటలో పేర్కొనబడిన దొరగాడు విస్నూరు దేశ్ ముఖ్. అతని పేరు రాపాక రామచంద్రారెడ్డి. ఈతడు పరమ కర్కోటకుడుగా ప్రజాకంటకుడుగా పేరుగన్నవాడు. అరవై గ్రామాలకధిపతి. ఈ విస్నూరు గ్రామం కూడా జనగామ తాలూకాలోనిదే, కడవెండికి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడవెండి కూడ విస్నూరు దేశముఖు ఏలుబడిలోనిదే. అందువల్ల ఈ దేశముఖ్ తల్లి కనకమ్మ కడవెండిలోనే ఉంటుండెడిది. ఇక్కడి ప్రజలు సైతం అతని కిరాతక చర్యలకు గురైన వాళ్ళే. తెలంగాణాలో సాయుధ పోరాటానికి అంకురార్పణగా విస్నూరు దేశముఖు గుండాల తుపాకీ గుండ్లకు బలైపోయిన అమరవీరుడు దొడ్డి కొమురయ్యది కూడా ఈ కడవెండి గ్రామమే. జనగామ నుండి సూర్యాపేటకు వెళ్ళే రోడ్డు మీద సీతారాంపురం అనే ఊరున్నది. విప్లవ సింహం నల్లా నరిసింహం కడవెండి గ్రామాన నల్లోల నర్సిమ్మ పేరెప్పి గుంజికొట్టెరా దొరగాడ! నీకైన మొనగాదురా! ఇది కడవెండికి మధ్య గ్రామం. కడవెండికి వెళ్ళాలంటే ఈ సీతారాంపురం స్టేజి వద్దనే బస్సుదిగి ఉత్తరం దిక్కుగా సుమారు రెండు కిలోమీటర్లదూరం వెళ్ళాలి. మధ్య ఒక వాగు అడ్డమవుతుంది. వాగు దాటితేనే కడవెండి గ్రామం. అప్పుడప్పుడూ వర్షాకాలంలో ఈ వాగు దాటనివ్వకుండా ప్రవహిస్తుంటుంది. అప్పుడు రాకపోకలు బందు. కడవెండి గ్రామ ప్రజలు మంచినీళ్ళకోసం ఈ వాగుకు వస్తుంటారు. ఎండాకాలంలో చెలిమలు త్రవ్వి నీళ్ళు తోడుకుంటారు. మహాకవి పోతన్న పుట్టిన బమ్మెర, శైవ సాహిత్యోద్యమకర్త పాల్కుర్కి సోమనాథుడు పుట్టిన పాలకుర్తి అనే గ్రామాలు కడవెండికి కూకపెట్టు దూరంతో ఉంటాయి. పాలకుర్తి ఈ ప్రాంతంలోని గొప్పశైవక్షేత్రం. ఇక్కడి కొండపై సోమేశ్వరుడు వెలసి ఉన్నాడు. ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుంది. సూర్యాపేట వైపు వెళ్ళుతూ సీతారాంపురం స్టేజి దాటగానే కామారెడ్డి గూడెం వస్తుంది. విస్నూరు దేశముఖు గుండాలచే హతమార్చబడిన బందగీ సమాధి ఇక్కడే ఉంటుంది. బందగీ సమాధికి నివాళులర్పించే దృశ్యంతోటే "మాభూమి" నాటకం ప్రారంభమవుతుంది. ఇక్కడ దిగి సుమారు రెండు కిలోమీటర్లు ఉత్తరం దిక్కుగా నడిస్తే తెలంగాణా సాయుధపోరాటానికి ఆయువుపట్టయిన మరోగ్రామం దేవరుప్పుల వస్తుంది.