TELIKA TELUGU VACHAKAM by BHADRIRAJU KRISHNAMURTHY book cover

TELIKA TELUGU VACHAKAM

by BHADRIRAJU KRISHNAMURTHY

₹100
In stock · 232 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట (రెండో ముద్రణ) ఇదివరకు భద్రిరాజు కృష్ణమూర్తి, వి. ఈశ్వర రెడ్డి కలిసి రాసిన 'జనవాచకం 1', 'రాత పుస్తకం', రాష్ట్ర వయోజన విద్యా డైరక్టర్ పర్యవేక్షణలో 1070 నుంచి 1990 దాకా తెలుగుదేశం నలుమూలలా చలామణీలో ఉన్నాయి. అవి విస్తృత ప్రణాళికతో తయారు చేసిన పుస్తకాలు, అంతవరకు వాడుకలో ఉన్న వయోజన వాచకాలకన్నా అవి శాస్త్రీయమైనవనే అభిప్రాయం అధ్యావకులందరికీ తెలుసు. ఇప్పుడు 'నేషనల్ లిటరసీ మిషన్' (ఎన్.ఎల్.ఎమ్) వారు సిలబన్ మార్చారు. మూడు భాగాల్లో ప్రైమర్ ఉండాలనీ, 9 పరీక్షా పత్రాలు కూడా అతపరచాలనీ కట్టడి పెట్టారు, చిత్తూరు, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వేరు వేరు వాచకాలు మూడు భాగాలుగా రాయించి ప్రవేశపెట్టారు. అవి రాసిన వారిలో భాషా శాస్త్రజ్ఞులెవ్వరూ లేకపోవటం వల్ల ఆ వాచకాల్లో ఎన్నో పొరపాట్లు దొర్లాయి. ఆ వాచకాలు మొత్తం పుటలు 180 నుంచి 200 దాకా ఉంటాయి. ఆరు నెలల్లో ఆర్యాపకులు వీటిని పూర్తి చెయ్యుటం అసాధ్యం. మొదటి రెండు భాగాల వల్ల అక్షరాలు రాయటం, చదవటం వస్తాయి. మూడో భాగం ప్రధానంగా చదివే సాధనకు వనికి వచ్చేది, ఉద్యమ రూపంగా జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగి చాలానుంది వాలంటీర్ల ద్వారా గట్టి ప్రయత్నం చేయించటం వల్ల ఎన్.ఎల్.ఎమ్. కొంతవరకు సత్ఫలితాలు సాధించింది; కాని వాచకాల రచన శాస్త్రీయంగా జరగటంవల్ల 'కాదు. ఈ ఉద్యమాన్ని సులభతరం చెయ్యటానికి, నేర్పే వ్యవధిని తగ్గించటానికి, ఈ 'తేలిక తెలుగు వాచకం' రాయటం జరిగింది. ఇది కూడ మూడు భాగాల్లో ఉంటుంది. ఇతర వాచకాలు రెండు భాగాల్లో నేర్పే అక్షరజ్ఞానం ఈ వాచకం ఒకటి, రెండు కలిసిన మొదటి పుస్తకమే సాధిస్తుంది. 'నేర్పే వారికి సూచనలు, పరీక్షా పత్రాలు (1-6 దాకా) ఈ పుస్తకంలోనే అనుబంధాలుగా ఇచ్చాం. ఈ వాచకాన్ని మూడు నెలల్లో పూర్తి చెయ్యవచ్చు. స్కూలు మానేసిన పిల్లల (dropouts)కు, వయోజనులకు (15-50 ఏళ్ళ మధ్య వాళ్ళందరికీ) ఈ వాచకం పనికి వస్తుంది. దీన్ని మన రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ప్రయోగిస్తే సత్వర ఫలితాలు వస్తాయని మా నమ్మకం.