TELIVAINA TEACHER - 40 by TULASI RAMACHARI Telugu book cover

TELIVAINA TEACHER - 40

by TULASI RAMACHARI

₹40
In stock · 751 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పెద్దలమాట వినకపోతే అనగనగా ఒక కోడిపెట్ట. దానికి ఆరు పిల్లలు. ఆ కోడి పిల్లల్లో కొన్ని అల్లరి చేసేవి, తల్లి మాట వినవు. "పిల్లలూ, నన్ను వదిలి దూరంగా ఉన్న ఆ పొదలు దాటి వెళ్లకండి -” అని తల్లి కోడిపెట్ట నెత్తిన నోరు పెట్టుకుని చెప్పింది. "అమ్మ ఎప్పుడూ అంతే. అట్లాగే చెబుతుంది రండర్రా-అలా పొదలు దాటి చిన్నచిన్న పురుగుల్ని తిని వద్దాం-" అని ఓ రెండు గడుసు కోడి పిల్లలు, భయపడే కోడి పిల్లల్ని పిలిచాయి. సరే అని అవి పొదలు దాటి వెళ్లాయి. "పిల్లలూ, పెద్దలు చెప్పిన మాటలు వినాలి తెలుసా... అలా వెళ్లకండి... జాగ్రత్త ” అని తల్లికోడి మరో మారు ముద్దుగా చెప్పింది. తల్లి మాట వినని కోడిపిల్లలు, మొక్కల మీదున్న చిన్న పురుగుల్ని తింటున్నాయి సరదాగా, ఇంతలో రెండు గద్దలు రివ్వున కిందికి వచ్చి రెండు కోడిపిల్లల్ని ఎత్తుకుపోయాయి. "అమ్మా! అమ్మా... గద్ద-" అంటూ మిగతా నాలుగు కోడిపిల్లలూ పొదల్లోకి పరుగెత్తి దాక్కున్నాయి.