TELLA GULABHI (NAVALA) by ATHALURI VIJAYALAKSHMI Telugu book cover

TELLA GULABHI (NAVALA)

by ATHALURI VIJAYALAKSHMI

₹150
In stock · 84 available
PublisherATHALURI VIJAYALAKSHMI
LanguageTelugu
తెల్ల గులాబీ ... 'ఆదీ! అదీ!” లోపల్నించి శిరీష పిలుపు వినిపించింది. ఆదిత్యకి పలకాలనిపించలేదు. తను కూర్చున్న బాల్కనీలోంచి కదలాలనీ అనిపించ లేదు. అమ్మ పిలుస్తూనే ఉంటుంది. కాస్సేపన్నా రిలాక్స్ అవనివ్వదు. కాలేజ్ నుంచి వచ్చి గంటసేపు కూడా ఆడుకోలేదు. ఆదిత్యకి చాలా కోపంగా ఉంది శిరీష మీద. తనకి పదహారేళ్ళు దాటుతున్నాయి అయినా చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తుందేంటో ఈ అమ్మ అనుకున్నాడు. ఆదిత్యకి శిరీష ఎందుకు పిలుస్తోందో తెలుసు. చదువుకో, చదువుకో అని చంపుకు తినడానికి, చదువు... చదువు... ఆ మాట వింటేనే చిరాగ్గా అనిపిస్తుంది. ఆడుకోనివ్వదు ఫ్రెండ్స్లో మాట్లాడనివ్వదు ఎప్పుడూ నాలుగ్గోడల మధ్యే కూర్చుని క్లాసు పుస్తకాలతో ఫ్రెండ్ప్ చేయాలంటుంది ఎంత బోర్! ఆదిత్య చూపు కింద వాకిట్లో ఆడుతున్న కుర్రాళ్ళ మీద కేంద్రీకృతమై ఉంది. వాళ్ళంతా ఎంచక్కా ప్రతిరోజూ ఆడుకుంటారు. క్రికెట్, షటిల్ ఎన్ని ఆటలున్నాయి! ఎంతసేపూ వెధవ చదువేనా? పిల్లలన్నాక ఆడుకోవద్దా? వాళ్ళంతా గంటా, గంటన్నరసేపు ఆడుకుని ఆ తరవాత ఇంట్లోకి వెళ్ళిపోయి కాస్సేపు చదువుకుంటారు, టి.వి. చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళంతా అదే అపార్ట్మెంంట్లో ఉండే పిల్లలు. ఆడపిల్లలంతే, మగపిల్లలంతే... వాళ్ళందరి ఇళ్ళలో చాలామంది ఉంటారు. నలుగురుంటారు ఇద్దరు పిల్లలు, అమ్మా, నాన్న, కొంతమంది ఇళ్ళల్లో వాళ్ళ నానమ్మలు, తాతయ్యలు కూడా ఉంటారు. ఎప్పుడూ వాళ్ళింటికి ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళమ్మలు ఉద్యోగాలు చేయరు ఇంట్లోనే ఉంటారు. కానీ, ఈ ఇంట్లో అమ్మా, తనూ... ఎప్పుడూ ఎవరూ ఈ ఇంటికి రారు. రెండు రోజులకోసారి వివేక్ అంకుల్ తప్ప ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దంగా, ఏంటోగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం అంటే ఆదిత్యకి భయం... ఇల్లంతా సందడిగా ఉండాలని, ఆదిత్య కోరిక చుట్టుపక్కల ఫ్లాట్స్లో లాగా ఈ ఇల్లు ఎందుకుండదో అనిపిస్తుంటుంది. తెల్లగులాబి అత్తలూరి విజయలక్ష్మి