
TELLARANI TELANGANA
by K SRINIVAS
₹275
In stock · 23 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076381
tellarani TELANGANA తెలంగాణ రాష్ట్ర అవతరణ ఒక ప్రజాస్వామిక అద్భుతం. ఆత్మత్యాగాలతో, సకలజన సాహస కార్యాచరణతో సాధించుకున్న సాఫల్యం. కొత్త చూపుతో కొత్తరేపును నిర్మించాలనుకున్న స్వప్నం. కానీ, దాని ఫలాలను, ఫలితాలను పండించి, పంచవలసిన పాలనలో ఆలనా లాలనా లేకపోయింది. ఒక ఎండమావి పరిహసించింది. ఆకాంక్షలు ఆశాభంగాలయ్యాయి. స్వయంపాలన సాధికారతను ఇస్తుందని, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన పరిమళిస్తుందని, ఉద్యమించి సాధించుకున్న విజయంలో హక్కులు, స్వేచ్ఛ వికసిస్తాయని కన్న కలలన్నీ విరిగిపోయాయి. అదొక విషాద ప్రయాణం. ఆత్మగౌరవ నినాదంతో ఎలుగెత్తిన ప్రజలు అహంకారం ముందు అవమానపడ్డారు. దొరతనాలను కూల్చిన సమాజంలో కొత్త గడీలు మొలిచాయి. ఒక ధర్మగంట కోసం జనం అలమటించవలసి వచ్చింది. ఆర్తనాదాలు, హితవులు, హెచ్చరికలు అరణ్యరోదనలయ్యాయి. చివరకు తెలంగాణ, తనతో నడిచి, తనను నడిపించిన పార్టీని అధికారం నుంచి తప్పించే నిర్ణయం తీసుకోక తప్పలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఆశలూ ఉంటాయి. కొన్ని నెరవేరవచ్చు. కొత్త నిరాశలూ మొదలు కావచ్చు. వేచిచూడాలి. పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన దగ్గర నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే దాకా సుమారు పది సంవత్సరాల తెలంగాణ రాజకీయ, సామాజిక గమనాలకు సమాంతర వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలోని వ్యాసాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బిఆర్ఎస్) రాజకీయ ధోరణులను, అభివృద్ధి విధానాలను, నాయకత్వం వ్యవహార సరళిని, జాతీయ రాజకీయాలలో తెలంగాణ ప్రయాణాన్నీ ఈ వ్యాసాలు చర్చించాయి. ఘనచరిత్రలో తెలంగాణ సమకూర్చుకున్న విలువలూ, విశ్వసించిన ఆదర్శాలే ఈ వ్యాసాలలోని విమర్శకు ప్రమాణం. పాలకులు ఉద్యమసమాజాన్ని బలహీనపరచడం, మేధావులు చొరవను కోల్పోవడం, మొత్తంగా సమాజంలోనే హీనవిలువలది పైచేయి కావడం వంటి పతనధోరణులను ఈ పుస్తకంలోని అనేక వ్యాసాలు కలవరంతో ప్రస్తావించాయి. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్ 'సందర్భం' కాలమ్ లో రాస్తూ వచ్చిన వ్యాసాల సంకలనం ఇది.