TELUGU BASHA SAHITYAM SAMAJAM-300 by CHINNAM RAJARAM book cover

TELUGU BASHA SAHITYAM SAMAJAM-300

by CHINNAM RAJARAM

₹300
In stock · 16 available
PublisherCHINNAM RAJARAM
LanguageTelugu
ముందుమాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆదికావ్యంగా చెప్పబడుతున్న భారతం ఎలాగైతే సకల శాస్త్రాలకు, విషయాలకు నిలయం అయిందో, అలాగే ఈ వ్యాస సంకలనం కూడ ఉంది. కలగూరగంప లాగ తెలుగు సాహిత్యంలో అన్ని కోణాల్లో వచ్చిన భావాల్ని, భావి పరిశోధనకు ఉపకరించే విధమైన వ్యాసాలను ఒకచోట పోగు చేసి సంకలనంలో పొందుపర్చారు. రాశిలోనే కాదు వాసి కలిగిన తెలుగు సాహిత్యాన్ని సాహితీ లోకానికి అందిస్తున్న సంపాదకులు అభినందనీయులు. ముఖ్యంగా ఈ సంకలనం చదివితే మౌఖిక సాహిత్యమైన జానపద సాహిత్యం మొదలుకొని ప్రాచీన సాహిత్యంలో తెలిపిన సామాజిక, భాషా విశేషాలు కనబడుతాయి. ప్రాచీన ప్రక్రియలే కాదు ప్రబంధ సాహిత్యం వరకు గల సాహిత్య ప్రాముఖ్యాన్ని తెలిపే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అంతేగాక ఆధునిక సాహిత్యంలో నవల, కథ, నాటకం, శతకం, కవిత్వం మొదలైన ప్రక్రియలపై రాసిన వ్యాసాలను చదివితే తెలుగు సాహిత్యంలో వచ్చిన సాహిత్య, సాంస్కృతిక, భాషలలో ఏర్పడిన వైవిధ్యం తెలుస్తుంది. విభిన్న కోణాల్లో విశ్లేషణ చేస్తూ రచించిందీ వ్యాస సంకలనం. జానపద సాహిత్యంపై వచ్చిన వ్యాసాలను చూస్తే, జానపద కళారూపాల్లో ముఖ్యమైనది నృత్యం. ప్రాంతాల ఆధారంగా, కుల, మతాల ఆధారంగా ప్రత్యేకమైన స్థానం నృత్యానికుంది. ఇందులో కోలాట నృత్యం ప్రదర్శించే స్థలం 'గరిడీ' అని నృత్తరత్నావళిలో తెలుపబడింది. కోలాటం ఒక సంస్కృతి, సంప్రదాయమైన నృత్యంగా భావించవచ్చు అనే విషయం బోధపడుతుంది. అలాగే తరతరాలుగా పాడుకుంటున్న పారమార్థిక గేయ సాహిత్యాన్ని విశ్లేషించిన తీరు, అనంతపురం జిల్లా ఉరుము నృత్య ప్రత్యేకతను తెలిపిన విధం చాలా బాగుంది. జానపద సాహిత్యంలో సామెతలు, పొడుపుకథలు జనపదుల్లో వినోదాత్మకమైన సాహిత్యమే అయినా ఎంతో సామాజిక విలువలను, అనుభవ సారమైన జ్ఞానాన్ని కలిగున్నట్లు తెలుస్తుంది.