
TELUGU BASHA VYAKARANAM
₹91
In stock · 2 available
PublisherDR.ADDANKI SRINIVAS
LanguageTelugu
ప్రవేశిక ఈ గ్రంథం విద్యారంగ ప్రాముఖ్యాన్ని, దానికవసరమైన అధ్యయన పరిశోధనలను గురించిన చర్చతో ప్రారంభమయింది. విద్యారంగం తొలినాళ్ళలో లాగా కాకుండా, నేడు వ్యవస్థీకృతమైన రంగం. అటువంటి రంగానికి భాషా స్థితిగతులే మూలం. దాని అభివృద్ధికి పరిశోధనాత్మకమైన నిరంతరాన్వేషణ జరగాలి. ఈ కారణంగా తెలుగు భాషకు చెందిన ప్రాచీన, అర్వాచీన (ఆధునిక) దృక్పథాలను పరిశీలించి, పరామర్శించ వలసి వచ్చింది. సదరు ప్రయత్నానికి అనురూపమే ఈ "తెలుగు భాష వ్యాకరణం". తెలుగు భాషలో ఒక విచిత్ర పరిస్థితి ఉంది. అన్యదేశ్యాల చేరికతో పుష్టిని పొందిన తెలుగు భాషకు సంబంధించి వర్ణ పరిగణన మొదలుకొని అనేక సమస్యలున్నాయి. వ్యాకర్తలు తెలుగు భాషా వర్ణాల విషయంలో అనేక సిద్ధాంత పూర్వకమైన పద్ధతులను ప్రతిపాదించారు. ఈ విషయంలో అంతిమ నిర్దేశం నేటికీ జరుగలేదు. అన్య భాషాపదజాలం తెలుగులో చేరడం వల్ల, అన్య భాషా వర్ణాలు ప్రవేశించాయి. ఈ కారణం చేత తెలుగు భాషకు వ్యాకరణం కూడా అన్య భాషనుండి రావలసి వచ్చింది. అదే తెలుగు వ్యాకరణ రచన సంస్కృత వ్యాకరణ ప్రభావంతో సాగింది. ఇది వర్ణ నిర్ణయం, సంధి, శబ్ద స్వరూపం, సమాసకల్పన, కారకప్రక్రియ, తదిత కృదంత రూపనిష్పత్తి మొదలైన అన్ని అంశాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది.