TELUGU CINEMA KATHA KATHANA SILPAM by M.R.KONDAL REDDY book cover

TELUGU CINEMA KATHA KATHANA SILPAM

by M.R.KONDAL REDDY

₹120
In stock · 224 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట సినిమా ప్రపంచం బహువిస్తృతమైనది. ఈ సృష్టి అంత అనంతమైనది. మన తెలుగు సినిమాలు ఒక బిందువు మాత్రమే. ఈ బిందువులోనే మొడవంత అపురూపమైన, ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలు అందించిన ఘన తెలుగు సినిమారంగానికి వుంది. ఎందరో మహోన్నత కళాకారుల అవిరళ ఫలితమిది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సినిమా కళని సజీవంగా ఇరాతి తరాలకు అందిస్తూ వచ్చారు. జనబాహుళ్యానికి కారుచౌక వినోద సాధనంగా లను అందిస్తూ వచ్చారు. తరం మారింది. ఇప్పుడు మనం 2000 సహస్రాబ్దిలో వున్నాం. నవతరం కులు తెలుగు సినిమాని కొత్త దిశకి తీసుకెళ్తున్న సందర్భమిది. ఈ సందర్భంగా ఇన్పార్బోర్డ్ సభ్యుడైన యం.ఆర్. కొండల్రెడ్డి ఒక కోరిక కోరారు. స్క్రీనింగ్ కొరకు - కమర్షియల్ చిత్రాలుంటే తనని పిలవ్వొద్దని, కొత్త దర్శకుల చిన్న సినిమాలకే నను పరిమితం చేయాలని కోరారు. కొండల్ రెడ్డి న్యూసినిమా ప్రేమికుడు. ప్రపంచ సినిమాని అర్ధం జేసుకున్న మేధావి. సహజంగానే ఆయనకు మామూలు కమర్షియల్ సినిమాలు రుచించవు. అయితే కొత్త దర్శకులు రూపొందిస్తున్న వివిధ చిన్న సినిమాలను సెన్సారింగ్ కొరకు వీక్షిస్తూ వచ్చిన కొండల్ రెడ్డిగారు అనతికాలంలోనే తీవ్ర అసంతృప్తి చెందారు. ఇవి విషయంలేని సినిమాలని, కొత్త దర్శకులకు అవగాహన లోపించిందని, తగుసినిమా పరిజ్ఞానం, సమాజ పరిశీలన, మానవ మనస్తత్వ అధ్యయనం మొదలైనవి లేకుండా అపరిపక్వ సినిమాలు తీస్తున్నారని ఆయన ఆవేదన చెందారు.