
TELUGU JANAPADA KALARUPALU
₹40
In stock · 67 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. డప్పు నృత్యం 'డప్పు' చాటింపు ఊర్లల్లో వినిపించేది. పెండ్లికైనా, చావుకైనా డప్పు చప్పుడు ఉండాల్సిందే. అయితే 'లయ, ధ్వని' వేరువేరుగా వుంటాయి. తెలుగునాట అంతటా కనిపిస్తుండే ఈ కళ అతి ప్రాచీనమైంది. తెలుగునాట అంతటా వినిపిస్తుంది. 'డప్పు' కేవలం మోత మోగించటానికే కాకుండా కళాత్మక విన్యాసాలలో కూడా చోటు చేసుకుంది. జాతరలు, కొలుపులు, ఉత్సవాలు, ఊరేగింపులు, పెళ్ళి, పండగ, సంబరాలు అన్నింట 'డప్పు' నృత్యం ఉంటుంది. ఇది సామూహిక కళ. ఒక్కోసారి ఇరవై మందికి పైగా బృందంలో ఉండి లయబద్ధంగా అడుగులు