
TELUGU NENE VELUGU NENE TELUGU NENE
₹200
In stock · 23 available
PublisherDR. ABK PRASAD
LanguageTelugu
ఇది ఎవరికోసం? ఎందుకోసం......? మన అందరికోసం, తెలుగువాళ్లందరి కోసం, ఆంధ్రులయిన యావత్తు తెలుగుజాతికోసం, వారి అభివృద్ధికోసం, అభ్యుదయ పరంపరాభివృద్ధికోసం: దాదాపు నూడువేల సంవత్సరాల లిపి, శాసనాల, నాణాల, చారిత్రక, సారస్వత, సాంస్కృతిక పునాదులుగల తెలుగువారందరి ఐక్యతకోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే, పరాయి పాలకుల కింద ఛిన్నాభిన్నమైపోయిన తెలుగుప్రాంతాలు, తెలుగు ప్రజలు పరాయి పంచలలో బతుకులీడ్చిన దుర్దినాలు మినహాయిస్తే ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల ఏలుబడిలో యావత్తు తెలుగువారి ప్రాంతాలూ ప్రజలూ ఒకే పాలనలో, ఒకే గొడుగు కింద వెలుగొందిన శుభఘడియలను మరొక్కసారి గుర్తు చేసుకోవడం కోసమే ఈ పుస్తక రచన, అనుబంధాల సంకలనమూ! ఈ ఘన చరిత్ర తెలియని తెలుగువాడిని, దారి తప్పిన శక్తులేవో నడిపిస్తే నడిచి తన జాతి చరిత్రకే చిచ్చుపెట్టుకుంటూ పక్కతోవలలో ప్రయాణిస్తున్న తెలుగువాడిని నాలోనే చూసుకుని నన్ను నేను సరిదిద్దుకోడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం! అందుకే తెలుగు ఆధునిక మహాకవులలో ఒకరైన మన తెలంగాణా బిడ్డ దాశరథి కృష్ణమాచారి కవితలోని మొదటి రెండు చరణాయిలన "తెలుగు నేనే " వెలుగు నేనే" పంక్తులకుతోడు, చెడిపోతున్న తెలుగువాడిని నాలోనే ఆవహింపజేసుకుని ఆ మకుటానికి నా ఆవేదనగా "తెగులూ నేనే!" అని మరో పంక్తి చేర్చాను! బహు కొద్దిమంది పదవీకాంక్షా పరుల స్వార్థప్రయోజనాలకోసం బయలుదేరే వేర్పాటు ఉద్యమాలకు శాశ్వత విలువ ఉండకపోగా యావత్తు తెలుగు రాష్ట్రం ప్రగతిబాటే చెల్లాచెదరై పోతుంది. సభ్య ప్రపంచంలో తెలుగువారు, ఒక జాతిగా నవ్వులపాలవుతారు. ఈ వేర్పాటువాదం ఏ స్థాయికి చేరిందంటే బూతులు రాజకీయ నినాదాలుగా మారుతున్నాయి, ఆవేశకావేషాలు పరిధులు దాటుతున్నాయి.