
TELUGU PARYAYAPADA NIGHANTUVU-400
by G.N.REDDY
₹400
In stock · 92 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆచార్య జి.ఎన్. రెడ్డి చిత్తూరు జిల్లా, మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్. రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. “తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం” అన్న అంశంపై పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్. పట్టా లభించింది. తెలుగు నేమోనిక్స్ మీద వీరు చేసిన కృషికిగాను పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను, వివిధ బోధనలను నిర్వహించారు. రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఫెలోషిప్‌లుగా పూణాలో కొంతకాలం పనిచేశారు. లెక్సికోగ్రఫీ పద్ధతి నుండి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల సాయంతో పలువురు ఎడిటింగ్ సహకారాన్ని వీరు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా (1984–1987) పదవి విరమణ చేసిన తరువాత యు.జి.సి. ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా (1988–89) నియమితులయ్యారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కార్యక్రమాలు నిర్వహించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్, యం.ఫిల్. డిగ్రీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీలలో చాలా కాలం సభ్యులుగా ఉన్నారు. వీరు తెలుగు సమానార్థాలు (1973), ఆంధ్ర–తెలుగు నిఘంటువు (1978), మాండలిక వృత్తి పదకోశం (కుమ్మరి, వడ్రంగి) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా వ్యవహరించి, భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్కృతులపై వివిధ మౌలిక రచనలు చేశారు. చేరదనకు మేలు, బుద్ధికి తెలివిప్పు, తెలివితేటలకు పదును, సమన్వయాలను పరచడంలో నేర్పును కలుగజేసే కోటికి నోరందియో తెలుగు పర్యాయపద నిఘంటువు!