TELUGU PATRIKALU - TEERU TENNULU by DR.G.S.VARADACHARI book cover

TELUGU PATRIKALU - TEERU TENNULU

by DR.G.S.VARADACHARI

₹150
In stock · 12 available
PublisherVAYODIKA PATRIKEYA SANGAM
LanguageTelugu
ప్రగతి పథం తెలుగు పత్రికలకు 177 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉంది. తొలి తెలుగు పత్రిక ఏది అనేది చర్చనీయాంశమే అయినా అందుబాటులో ఉన్న సమాచారంలో అస్పష్టతేమీ లేదు. రెవరెండ్ జె. లాంగ్ 1859లో బెంగాల్లోని తమ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం 1833 నాటికే తెలుగులోను, తమిళంలోను పత్రికలుండేవని, వాటికి మద్రాసు ప్రభుత్వం గ్రాంటులు ఇస్తుండేదని తెలుస్తున్నది. తమిళ పత్రిక వెయ్యి ప్రతులు అమ్మకమయ్యేదని, తెలుగు పత్రిక ప్రాచుర్యం తక్కువగా ఉండేదని ఆయన రాశారు. ఆయన రాయలేదు గనుక పేరుగాని, ఇతర వివరాలు గాని తెలియవు. బహుశా అవి అప్పటి రాజపత్రాలు అయి ఉండవచ్చు. ఆచార్య జి.ఎన్. రెడ్డి ఒక పరిశోధన పత్రంలో ఆనాటి తెలుగు గురించి తెల్పడానికి ఫోర్టు సెయింట్ జార్జి గజిట్లోని తెలుగు ప్రకటనలను ఉల్లేఖించారు. లాంగ్ ప్రస్తావిం చినవి బహుశా ఇవే కావచ్చు. రెడ్డి ఉల్లేఖించిన ప్రకటన పాఠం ఇలా ఉంది: "యిందు వల్ల తెలియజేసేది యేమంటే అడ్డెషనల్ గవర్నమెంటు కమీషనరుగారి వల్ల పరిష్కరించబడిన నన్నూరు రూపాయలకంటే అధికముగా వుండే కొద్దిపాటి దావాలకు గవర్నమెంటు ప్రామిసరీ నోట్లు యివ్వడానికి బదులుగా యీ తారీఖు మదలుకొని సదరహి కమీషనరు యొక్క సరిటేపేకేట్లు తాలూకు అయివజు నన్నూరు రూపాయలకు ఎక్కువగా వున్నా తక్కువగా వున్నా ఆ అయివజును రొక్కముగానే =వ్వడము అవుతున్నది. ఫోరటు సైంటు జార్జి 1834 ఆగష్టు నెల 15వ తేది ఆలోచన సభలో గవర్నరుగారి వుత్తరువు ప్రకారం" ఈ పై విషయం ఆంగ్లప్రతికి మూలవిధేయానువాదమని కూడా ప్రచురించారు. ఏనుగుల వీరాస్వామి ఈ అనువాదం చేసినట్టు తెలిపారు. రాజపత్రమును పత్రికగా పరిగణించే వీలుండదు. కనుక 1835లో వెలువడిన "సత్యదూత” తొలి తెలుగు పత్రిక అని కొందరు పరిశోధకులు నిర్ధారించారు.