
TELUGU SATHAKAM
₹20
In stock · 13 available
PublisherSRIPADA VADICHARLA SATHYAM
LanguageTelugu
తెలుగుశతకం మన వెలుగుపతకం శ్రీవదవడిచర్ల సత్యంగారు గత పదిసంవత్సరాలుగా నాతో సాహితీమిత్రులుగా కొనసాగుతున్నారు. వీరు తెలుగుభాష తీయదనాన్ని తనధనంగా భావించి విద్యార్థులకు మన తెలుగు వెలుగులనందించాలని నిరంతరం తపిస్తున్న కర్మయోగి. నివురుగప్పిన నిప్పులా వుంటు రంగారెడ్డిజిల్లా తాండూర్ ప్రాంతంలో సాహిత్యసేవలందిస్తున్నారు. వీరు చిన్నారి బాలబాలికల కోసం తెలుగుపదాలు సులభంగా నేర్చుకొనే విధంగా 'అక్షరాలతో ఆడుకుందాం' (2008) అనే తెలుగువాచకాన్ని రచించి అధికారుల, ఉపాధ్యాయుల, విద్యార్థుల మన్ననలందుకొని కూనలమ్మపదాల మాదిరిగా 'జాబిలమ్మ పదాలు' (2010) అందించి అందరి మెప్పులను పొందారు. ఏ పాట రాసిన పద్యం వ్రాసిన సరళమైన భాషలో శబ్దాలంకార భూషితాలై సరసహృదయుల హృదయాలలో చోటుచూరుకొంటాయి. తెలుగులో అనాదిగా వస్తున్న ప్రక్రియలను అధునాతనంగ సాగించే క్రమంలో పదం, పద్యం, పాట చేపట్టి ఎన్నో సాహిత్య క్రీడలు సాగిస్తూ బాలసాహిత్యం నందిస్తున్నారు. అందులో భాగంగానే వీరు రచించిన 'విప్పుచెప్పుబాల' అనే పొడుపుకథల శతకంను రాజీవ్ విద్యామిషన్ (SSA) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (2009) ప్రచురించి బాలలకందించింది. 'తెలుగువెలుగీ జగతి అలుముకొంటే ప్రీతి' అనే భావనతో తెలుగుసాహిత్య లోకంలో నిత్యనూతనంగా వెలుగులీనుతున్న తెలుగుకవులను ఆటవెలదిపీఠంపై అలంకరించారు. ఈ శతకం శ్రీకారంతో ప్రారంభించి శ్రీకారంతో ముగించారు. నన్నయ మొదలుకొని చెన్నయ వరకున్న వరకవుల నెందరినో వారివారి కవితాంశాలతో మనోహరంగా అలతి అలతి తెలుగపదాలతో అభివర్ణించారు. తరువాత ముప్పైపద్యాలలో తెలుగుభాష వైభవాన్ని కొనియాడారు. 'తెలుగుభాషనాది తెలుగువాడనునేను / తెలుగుపలుకు మంచి తేనెచినుకు /మాతృభాష కలిమి మనుగడకు చెలిమి / తెలిసి చదువుబాల తెలుగులీల'. 'నిక్కమైనమంచి నీలమొక్కటిచాలు' అని వేమన చెప్పినట్లు ఈ ఒక్కపద్యం చాలు మన తెలుగువాళ్ళ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పుటకు. ఇందులో ఏ పద్యతంత్రిని మీటిన సుస్వరాలే వినిపిస్తాయి. సప్తవర్ణాలే కనిపిస్తాయి. ఏ గణానికి ఆ పదం, ఏ పాదానికి ఆ పాదం ఆపాతమధురమై శ్రీపదకలం నుండి జాలువారిన గంగాతరంగిణి 'సత్యం' రచనాశైలి.