
TELUGU TEJAM PURIPANDA APPALASWAMY JEEVITHAM
by DR.DWANA SASTRY, DR.B.SATYANARAYANA
₹30
In stock · 42 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. నాంది 1920 నుంచి 1940 వరకూ సాగిన ఒకానొక సాహితీ సంధియుగపు సంగ్రామకేళిలో ఆధునిక కవితా పాండవపక్షానికి ఐదుగురు మహారథులు ప్రకాశించారు. వారందరిలోనూ పురిపండా అగ్రజులు. 1904లో జన్మించిన పురిపండా ధర్మనందనులు. 1908లో జన్మించిన శ్రీరంగం నారాయణబాబు సాక్షాత్తూ భీమసేనుడు. 1910లో జన్మించిన శ్రీ రంగం శ్రీనివాసరావు అర్జునుడు. సవ్యసాచీ, ధనంజయుడు.... ఏ పేరుతోనైనా పిలవవచ్చు. 1912లో జన్మించిన శిష్ట్లా ఉమామహేశ్వరం నకులుడు. 1915లో జన్మించిన పఠాభి సహదేవుడు. వెరశే వీరంతా ఆధునిక కవితకు పంచపాండవులు. ఆధునిక కవితా పాండవాగ్రజులుగా మూర్తీభవించిన ధర్మతేజంగా కీర్తింపబడవలసిన వ్యక్తి పురిపండా." ఇది ఆధునిక కవితాలోకాన్ని నిశితంగా వరిశీలించిన ఆవంత్స సోమసుందర్ సత్యోక్తి. 'సభాపతి' తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి కూడా పురిపండాకు ఇచ్చిన కితాబు చూడండి- "శ్రీ పురిపండా అప్పలస్వామిగారు స్నేహపాత్రుడు. సరళ హృదయుడు, బహు భాషా కోవిదుడు. అన్య భాషలనుంచి మంచి గ్రంథములు ఆంధ్రీకరించినాడు. ఆయన అవలంబించిన రీతి మిక్కిలి సరళము. వాడుక భాషలో చెయి తిరిగిన అప్పలస్వామిగారి రచనలు ధారాళముగా చదివి ఆనందించవచ్చును. విశాఖ నగరములో కవితా సమితి బహు కాలము కిందట స్థాపించి శ్రీశ్రీ ప్రభృతులను వృద్ధిలోనికి తెచ్చినాడు." అస్సాం - గౌహతిలోని కాటన్ కాలేజి ఆంగ్లశాఖాధ్యక్షులు టి.కె. భట్టాచార్య వాస్తవ స్తవం ఇది "As a poet, a writer of homely prose, and editor, and a transla-tor, sri Puripanda Appalaswamy has made valuable contributions to the growth and expansion of modern Telugu literature. A man of utter sim-plicity and unassuming manners, and one who has not totally sold his soul to the west, sri Appalaswamy has a critical objective and impar-tial way of looking at things and controversies. He is a patriot and is deeply rooted in the soil, but his views are remarkably modern, pro-gressive and generous...."