
TELUGULO ATHIDIPADALU
₹40
In stock · 4 available
PublisherDR.G.V.PURNACAHND
LanguageTelugu
అరువు పదాలు కావివి, అతిథిపదాలు అరువు ఊరికే పుట్టదు. ఏదైనా తాకట్టు పెట్టి తీసుకోవాలి. లేదా చేబదులుగా తెచ్చుకోవాలి. కానీ, ఒక సంపన్న భాషలోంచి పదాలను మనం బదులుగా తిరిగి ఇవ్వకుండానే పూర్తి ఉచితంగా తెచ్చుకుంటున్నాం. ఒక భాషా పదాన్ని ఇంకో భాషీయులు ఉన్నది ఉన్నట్టుగా తమ భాషలోకి స్వీకరించి అదే అర్ధంలో ఉపయోగిస్తున్నపుడు, 'దాతభాష' నుండి స్వీకర్త భాషలోకి వచ్చిన 'అన్య దేశ్యాలను' 'అరువు పదాలు' (Foreign Loan words) అనటంకన్నా అతిథి పదాలంటే సబబుగా ఉంటుంది. నిజానికి, ఋణమాఫీ చేస్తే తీరే అప్పుకాదిది. అరువు అరువే! అన్నం, పుస్తకం లాంటి సంస్కృత పదాలను తెలుగు పదాలుగా వాడుకున్నట్టే, రైలు, రోడ్డు, ఫ్యాను, బ్యాంకులాంటి ఆంగ్లపదాలు కూడా తెలుగువారి హక్కు భుక్తాలుగా మారిపోయాయి! అరువు ఎవరిచ్చారు? దానం ఎవరు చేశారు...? చాలా విదేశీ భాషా పదాలను అవి మనవి కావని తెలీకుండానే మన అవసరాలకు వాడేస్తున్నాం. వాటికి కాపీ రైటు చట్టం వర్తించదు కాబట్టి. వాటిని తెలివి మాటలుగా స్వీకరించగలగటమే హుందాతనం అవుతుంది. మనం ఏ భాషా పదాన్ని తెచ్చుకున్నా ఇముడ్చుకోగలిగే సహిష్ణుత తెలుగు భాషకు ఉంది. కాబట్టి, ఏ అరువు పదం అయినా అది అతిథి పదం లాగా వచ్చి సహకరిస్తుంది. రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్యని నడిపించే ఉత్ప్రేరకం (కెటలిస్టు) లాంటిది ఈ అతిథి పదం. అది మన భాషా కుటుంబంలోది కానప్పటికీ, మనదే నన్నంతగా మన భాషలో కలిసిపోతుంది. దాన్ని ఉపయోగించుకోగలిగే చాకచక్యం సంభాషించే వాడి చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది. బస్సెక్కి వచ్చాను, రైలొచ్చేసింది, ఫ్యానేశాను, రోడ్డెక్కింది ఇలా పలకటానికి దేశీ, విదేశీ మీమాంస జనానికి అక్కర్లేదు. అవతలి వ్యక్తికి అర్ధం కావటమే సంభాషణకు పరమావథి కాబట్టి, మాట్లాడేప్పుడు దేశీయమా విదేశీయమా అనేది అప్రస్తుతం అవుతుంది. తెలుగులో సంస్కృత, పాళీ, ప్రాకృత భాషాపదాలు కొల్లలుగా ఉన్నాయి. అవికాక అరబ్బీ, పారసి, ఉర్దూ, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి పదాలు మరిన్ని మన జనం నాలుకల మీద యథేచ్చగా ఆడుతున్నాయి. బ్రిటిష్ వాళ్లు కోస్తాంధ్ర, సీమ ప్రాంతాలను