
THADEKA - SAHITYA VIMARSHA VYASALU
₹150
In stock · 29 available
PublisherNAVATELANGANA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788196474331
సాహిత్య విమర్శ వ్యాసాలు తెలుగు సాహిత్య విమర్శకు ఒక కొత్త సంతకంతో వస్తున్న యువ విమర్శకుడు డా.మహమ్మద్ హసేన. ఈ మధ్యకాలంలో వ్యాసాలు, వచన కవితలు రాస్తున్న వారిలో డా. మహమ్మద్ హసేన పేరు కూడా తరచుగా కనిపిస్తోంది. కవిత్వం, కథ వంటి సృజనాత్మక రచనలు చేయడం ఒక పార్శ్వమైతే, ఆ సృజనాత్మక రచనలు చదివి దానిలోని వస్తువుని, శిల్పాన్ని పట్టుకోవడం మేథోగతమైన పార్శ్వం. తెలుగు కవులు, రచయితలకు ప్రాంతాలతో పనిలేదని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సాహితీవేత్తలను దీనిలో విశ్లేషణకు తీసుకొని, తాను ఆకాంక్షించిన మానవతావాదానికే తాను కట్టుబడి ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ వ్యాససంపుటి డా. మహమ్మద్ హసేన గారిని ఒక యువ విమర్శకుడిగా పరిచయం చేస్తూనే, సాహిత్య విమర్శకు ఒక ఆశాకిరాణాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. . ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు