THATHA MANAVADU.COM by DR.C.BHAVANI DEVI Telugu book cover

THATHA MANAVADU.COM

by DR.C.BHAVANI DEVI

₹125
In stock · 527 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ కథల గురించి ఈ కథలగురించి ఒకటి రెండుమాటలు చెప్పాలంటే ముందు 'నది' పత్రిక, ఎడిటర్ ఇన్ఛార్జి శ్రీజలదంకి ప్రభాకర్ గురించి చెప్పకుండా ఉండటం కుదరదు. 'నది' పుట్టుక తెలీదుగానీ ప్రభాకర్ గారు ఎడిటర్గా పరిచయమైన కొన్నాళ్ళకు పిల్లలకోసం కథా ఫీచర్ అడిగారు. అప్పటి దాకా అడపాదడపా బాలల కథలు, పాటలు రాస్తున్నానుగానీ ఫీచర్లాగా... అంటే కొంత ఆలోచించి పూనుకున్నాను. నా తొమ్మిదవ ఏటనించే 'చందమామ' కి అభిమాన పాఠకురాలిని. ఎవరురాసినా పిల్లల కథలు నిరంతరం చదివే అలవాటున్నది. బాలసాహిత్యం రాయటం కష్టమైనా ఇష్టం. పిల్లల ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళ కోసం ఆసక్తికరమైన ఆకర్షణలతో కథ రాయటం అంటే మనం మళ్ళీ మన బాల్యంలోకి వెళ్తున్నట్లే. అందుకే ఈ కథలు ధారావాహికంగా 'నది'లో అక్టోబరు 2007 నుంచి జనవరి 2012 వరకు ప్రవహించి ఆ ప్రవాహకాలంలో నా పసితనపు ఆనందాన్ని మళ్ళీ నా కందించాయి. ఇందుకు 'నది' ఎడిటర్ వీఆర్రావు అవ్వాస్ గారికి ధన్యవాదాలు. శ్రీ కరుణాకర్ బొమ్మలు నాకు చాలా అభిమానపాత్రమైనవి. ఈ కథల్ని ఆదరించిన పాఠకులు నాకెప్పుడూ గౌరవనీయులే! ఈ ప్రచురణని మరింతమంది పాఠకులకి చేరువ చేస్తున్న 'విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్' వారికి కృతజ్ఞతలతో.....