
THE EPIDAMIC - HYD VIRUS
₹130
In stock · 3 available
PublisherVAHINI BOOK TRUST
LanguageTelugu
THE EPEDIMIC - Hyd Virus (A Scientific Fantacy Novel) by Dr. CHITTARVU MADHU జంటనగరాలకి వైరస్ జ్వరం పట్టుకుంది. ఎవరికి చూసినా జ్వరం! ఒళ్లు నొప్పులు! ఒంటి మీద ఎర్రటి మచ్చలు.....! విపరీతమైన బాధ! జనం నగరం విడిచి పారిపోతున్నారు. రక్తస్రావం..... ఫిట్స్.... ఎక్కడ చూసినా రాక్షసి దోమల గుంపులు! ఈ దోమలు లక్షల సంఖ్యలో నగరం మీద దాడి చేస్తున్నాయి! వాటి లాలాజల గ్రంధుల్లో వైరస్ కణాలు.... అవి భయంకరమైనవి. వాటికి ఆర్ఎన్ఎ వుంది. డిఎన్ఎ కోసం అర్రులు చాస్తున్నాయి. హోస్ట్ కావాలి.... ఈ భూగ్రహాన్నంతా ఆక్రమించి ఒక బ్రహ్మాండమైన బహుకణజీవిగా ఎదగాలి.... వాటికి మొదలు లేదు.... ఆలోచన లేదు.... ఇన్స్టింక్ట్..... అంతే! ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన స్వైన్ఫ్లూ జ్వరం నేపధ్యంలో రాయబడిన ఈ వైజ్ఞానిక థ్రిల్లర్ నవల.... డా. చిత్తర్వు మధు ఇదివరలో రాసిన ఐసిసియు, బై బై పొలోనియాలకి సీక్వెల్! మొదలుపెడితే ఆగకుండా చదివించే నవలాత్రయంలో ఆఖరిది. ఈ భయంకరమైన ఎపిడమిక్ కి ఎవరు కారకులు? అది ఎలావ్యాపించింది? చివరికి ఎలా నిర్మూలించ బడింది?... తెలుసుకోవాలంటే ఆలస్యం ఎందుకు....? చదవడం మొదలు పెట్టండి! వాహిని బుక్స్ప్రెస్స్