THE MIRRAR OF EENADU 2008 by MANDAPATI SATYANARAYANA REDDY Telugu book cover

THE MIRRAR OF EENADU 2008

by MANDAPATI SATYANARAYANA REDDY

₹40
In stock · 5 available
PublisherMANDAPATI SATYANARAYANA REDDY
LanguageTelugu
నా మాట మందపాటి 2009 మానవాళికి మంగళప్రదం కావాలని, ఆశిస్తూ... ఆకాంక్షిస్తూ... 2008లో నా అభిమాన పత్రిక "ఈనాడు" పతాకశీర్షికలపై "ది మిర్రర్ ఆఫ్ ఈనాడు-2007" వెలువరించాను. పత్రికా పరిభాషలో రాసినా సహృదయ పాఠకులెందరో ఆదరించారు. "ఈనాడు" పత్రిక, "ఈటీవి"లు నన్ను ఈ విషయంలో విశేషంగా ప్రోత్సహించాయి. వారి ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. వారికి నా కృతజ్ఞతాభివందనములు. "ది మిర్రర్ ఆఫ్ ఈనాడు-2007"ను చదివి మిత్రులు శ్రీ కృష్ణయ్య, రాజారావులు ఈ వార్తలపై నీ స్పందనను జోడిస్తే బాగుంటుందని సూచించారు. వారి సలహాల మేరకు పద్యానికో స్పందనను "మందపాటి మాట మరువ వలదు" మకుటంతో, ఆటవెలదులుగా జోడించి వెలువరించాను. వారిచ్చిన సలహాలు నా ఈ రచనా వ్యాసంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. ఈ రచనలోని యతిప్రాసలు మొదలుకొని, అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి, సరిచేసిన శ్రీ రామన్నకు, అన్ని విషయాలలో అన్ని హంగులు సమకూరుస్తున్న ఎన్.వి.ఆర్ పాఠశాల యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా రచనల ప్రచురణల విషయంలో అండగా నిలిచి, సహాయ సహకారము లందిస్తున్న కళాశాల మిత్రుడు శ్రీ బండారుపల్లి వెంకయ్యగారు, కవిత ఆఫ్సెట్ ప్రింటర్స్ ఖమ్మం వారికి సర్వథా కృతజ్ఞుణ్ణి. డి.టి.పి. విషయంలో ఎన్ని పనులున్నా నా కంటూ సమయం కేటాయించి సకాలంలో సహకారమందిస్తున్న చిరంజీవి బీరెల్లి పుల్లారెడ్డికి అభినందనలు. చిట్టచివరిగా... ఎన్ని రోజులులేకున్న యెటుతిరిగిన గాని, పత్రికలనుదాచి కాపుకాచి వ్రాసుకొనుటకు ప్రచురించి వ్యాప్తిజేయ ప్రోత్సహించిన శ్రీమతీ పొత్తమిదిగో|| , ... మందపాటి సత్యనారాయణరెడ్డి