
THE VIEWS
by SRI SRI SRI GURU VISWA SPHOORTHI
₹99
In stock · 2 available
PublisherSRI SRI SRI GURU VISWA SPHOORTHI
LanguageTelugu
A SCIENCE UNIVERSE PUBLICATION శరవేగంతో సాగిపోతున్న నేటి శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మూలంగా కృత్రిమ జీవన విధానానికి లోబడిన మానవాళిని వాస్తవ భావాలతో, సూచనలతో, హెచ్చరికలతో మేల్కొలపాలనే సదుద్దేశ్యంతో ధ్యానసాధనద్వారా సముపార్జించిన అపారమైన తమ మేథస్సు ఆధారంగా శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తివారు సమకాలీన పరిస్థితులగురించి వ్యక్తపరచిన భావాల సంపుటే “ది వ్యూస్”. ఈనాటి సమాజంలో వార్ధక్యము, వానప్రస్థము మాత్రమే ఆధ్యాత్మిక ఆలోచనలకు సరైన సమయం అనే సిద్ధాంతం వర్తించదనీ, మరుగునపడిన గురుకులాలు, మాయమౌతున్న కుటుంబ వ్యవస్థ, బాల్యంనుండీ ఒక క్రమపద్ధతిలో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దలేకపోవడంవల్ల సమాజానికి, దేశానికి, సమస్త మానవాళికి కలుగుతున్న విపత్తు - ఇత్యాది సమస్యలన్నింటినీ కూలంకషంగా చర్చించి వాటన్నిటికి ఇచ్చిన సమస్యాపూరణములతో కూడిన గ్రంథమే “ది వ్యూస్”. శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తివారి దివ్య ఆలోచనా తరంగాల ఒరవడిలోని ఒక మహాగ్రంథమే “ది వ్యూస్". దీనిలో వారు మానవ జీవిత ప్రాధాన్యతను, జీవిత సార్థకతను, ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకతను అత్యంత సులభశైలిలో అందరికీ అర్థమయ్యేటట్లుగా వివరించారు. మానవ జీవితం ద్వారానే సర్వలోకాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మహామనీషి శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి. వారు మానవాళికి చేస్తున్న దివ్య సేవలో మనమూ పాలుపంచుకొందాము. నేటి మానవ జీవన విధానాన్ని సునిశితంగా పరిశీలించి అందులోని లోటుపాట్లను సహజశైలిలో విశదీకరించిన తీరు, ఆలోచన చేయగల ప్రతిఒక్కరూ అధ్యయనం చేయవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తుంది “ది వ్యూస్”. సైన్స్ యూనివర్స్