THEERTHAPU RALLU KATHALA SAMPUTI by V.V.N.MURTHY Telugu book cover

THEERTHAPU RALLU KATHALA SAMPUTI

by V.V.N.MURTHY

₹70
In stock · 106 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అగ్గిపుల్ల అదిగో అదే తిమ్మాపురం/ అదే ఆ పూరి మంచినీటిచెరువు. దానికి పడమటనా దక్షిణానా ఊరంతా ఉంది. ఉత్తరాన పంటపొలాలున్నాయి. తూరుపున కొద్దిమేర పంటపొలాలూ తరవాత ఊరగాలని ఉన్నాయి. ఊరగాలవకీ, మురుగుదొడ్డి కాలవకీ మధ్యగా మాలపల్లి ఉప్పరిగూడెమూ ఉన్నాయి. మాలపల్లిని ఆనుకునే ఉత్తరంగా మాదిగల యిళ్ళున్నాయి. తూరుపునించే ఆ మాలపల్లి మధ్యగా ఊళ్ళోకి సాగివచ్చే మట్టిరోడ్డు ఉంది. ఆ రోజు చుక్క పొడిచింది. పెద్దోడు తోటకాపలానించి సమయానికే యింటికివచ్చి ఉప్పురాయితోనూ ఉల్లిపాయతోనూ చలిదిగంజి తాగాడు. "కూంత కూకుని యెల్లగూడదా?" అంది మంగమ్మ. మీసాలు ఒత్తుకుని, తూరుపు పొలంనించి వస్తూ తెచ్చిన పాఠ అందుకుని జవాబివ్వకుండా బయటపడ్డాడు పెద్దోడు. మొలకి వెండితాడు. కాళ్ళకి కిర్రుచెప్పులూ, ఓ చేత బడితకర్రా, మరో చేత పార పొడవుగా, దృఢంగా ఉన్నాడు. పెద్దోడి నిజనామం బ్రహ్మయ్య. అయితే ఆ గ్రామంలో పెద్ద పెద్దలనించి ఆట పాపల దాకా వాడేపేర్లు "కందులబెమ్మిగాడు. మాలబెమ్మడు" యిత్యాదులు. "పనమీదున్న సేనుకి కాపలాయెట్టు! పంటమీదున్న తోటకి కాపలా కాపలాయెట్టు! యింటికాడ నీకు కంటినిండా నిద్దరట్టకపోతే నన్నడుగు!" అంటుంటాడు బ్రహ్మయ్య గూర్చి యజమాని వీర్రాఘువులు. అంత నమ్మకమూ ఉన్నా. చిన్న పొరపాటు జరిగితే "కడజాతెదవకి నీతా?" అని కూడా అనెయ్యగలడు.' నిజంగానే బ్రహ్మయ్యకి మంచిపేరే ఉంది. " పేరు సాలదంటే జలమకి" అంటుంటాడు పెళ్ళాంతో, అగ్గిపుల్ల