THIKKASANKARAYYA JARGI KLABBU by VEDULA CHINNA VEENKATA CHAYANULU Telugu book cover

THIKKASANKARAYYA JARGI KLABBU

by VEDULA CHINNA VEENKATA CHAYANULU

₹60
In stock · 214 available
PublisherVEDULA CHINNA VEENKATA CHAYANULU
LanguageTelugu
ముందుమాట గంబును తెలుగులో హాస్య వ్యంగ్య రచనలు తక్కువనే చెప్పాలి. ఈ నవలికలో కథ ప్రధానం కాద సన్నివేశములు, సంభాషణలు సరిగా ఉండాలని ప్రయత్నించి వ్రాసేను. చాలా మట్టుగు భాష విశాఖపట్టణం జిల్లాలో వాడే వాడుక భాషే ఏ ప్రాంతం వాడుక భాషైనా మన తెనుగు భాషలో మృదుత్వం, మాధుర్యం మిగత భాషలలో కంటే యెక్కువ అని నాకు తోస్తుంది. ఇది స్వాభిమాన మవవచ్చు. అది తప్పుకాదని నా నమ్మకం. ఈ రచనలో ఆంధ్ర ద్రావిడ బ్రాహ్మణులను దుయ్యబట్టేనేమో అని వారిలో ఎవరైనా అనుమాన పడి నామీద చిందులు త్రొక్కే ముందే; నేనూ ఆ ద్రావిడ బ్రాహ్మణుడనే అని విన్నవించుగుంటున్నాను. కుల మత పిశాచాలు చెలరేగి మన సభ్యత, సంస్కృతి, నాశనం అవుతూన్న నేటి రోజులలో నేనీ కులమునకు చెందిన వాడిని అని చెప్పుకోడం మంచిది కాదేమో అని మీ రనవచ్చును. పరనింద చేయకుండా ఆత్మస్తుతి చేసుగుంటే తప్పు లేదంటాను. మన అందరిలోనూ యేవో ఒక చెప్పుకోదగ్గవి పరంపరగా వస్తున్నాయి. అవి గుర్తిస్తే వారి వంశస్తుతిలో తప్పేముంది. మనదేశంలో యితర జాతుల వారిమీద గాని తర మతస్థుల వారిమీద గాని గౌరవం, ఆదరణ, గాంధీగారికన్న మరి యెవరికేనా యెక్కువగా ఉందా? ఐతే, తను హిందువుడనని తన హిందూ మతాన్ని అతను గౌరవించ లేదా? ఇదంతా యెందుకని చెప్తున్నారయ్యా, అని మీరడుగవచ్చు. నేను ఆ ద్రావిడ బ్రాహ్మణుడనని చెప్పుగోడానికి నాకు గర్వమే! అందుకని వారినెలా దుయ్యబట్ట గలను? రచయిత తన స్వంత అనుభవాలను, తనకు తెలిసిన వారినీ, తన కావ్యాలలో కూర్చి కుదర్చడం సాధారణ విషయమే. కాని యిందులోని పాత్రలు, సన్నివేశాలు, కేవలం కల్పితములే. వేదుల చిన్న వేంకట