THILAK KATHALU by DEVARAKODA BALAGANGADHARA THILAK Telugu book cover

THILAK KATHALU

by DEVARAKODA BALAGANGADHARA THILAK

₹300
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
లిబియా యెడారిలో” లిబియా యెడారిలో ఓ పెద్ద యిసక తుఫాను వచ్చింది. మండే తెల్లని నల్లని యిసుక తరంగం మీద తరంగంలా పైకి లేచింది. ఒక మూల విరిగి పడివున్న విమానం చటుక్కున పైకిలేచి గిర్రున తిరుగుతూ ఓ పెద్ద చెట్టుకి తగిలి తిరిగి కిందికి పెద్ద చప్పుడు చేస్తూ పడిపోయింది. అందులో ఇదివరకు చచ్చిపడివున్న పైలట్ తిరిగి చచ్చిపోయాడు. తర్వాత రోజున వీధులలో రక్తం కారే వార్తాపత్రికలు అమ్ముకున్నారు. ఇందులో ఇలా వుంది. "జర్మన్ పైలట్ అమోఘ వీరమరణం విజయం మనదే!" ఆ మరుసటి రోజున అక్షరాలు లేని తెల్లని పత్రికలు అమ్మారు. అందులో ఇలా వుంది: "పైలట్ భార్య తన ఇద్దరు కొడుకులను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. జర్మన్ నారీమణుల ఆదర్శ దేశభక్తికి ఇదే తార్కాణం." ఈ వార్త విని అసూయతో బ్రిటిషు ద్వీపం ఎర్రబడింది. తీరాన్నే ఉన్న వెయ్యిన్నొక శతఘ్నులు ఉక్రోషంతో ఠక్కున పేలాయి. అమెరికాలో, ఇంగ్లండులో, ఇతర దేశాలలో కోటికోటి గోరీలు పగిలించుకుని, చచ్చిన సైనికులందరూ ఒక్కొక్క విమానం మీద, ఒక్కొక్క ఓడమీద, కాలినడక మీద లిబియా ఎడారి చేరారు. తిరిగి అనేకమైన పగిలి పడివున్న విమానాలు పైకిలేచి ఒకదాని నొకటి ఢీకొని