
THOKAPOYE KATTI VACCHE DHAM DHAM DHAM-40
₹40
In stock · 535 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఓ పిట్టకథ Teevee ఒకానొకప్పుడు నల్లమల అడువుల్లో ఓ వల్లంకి పిట్ట ఉండేది. అది ప్రతిరోజూ చేల వెంబడి తిరుగుతూ ఏవో గింజలు తిని పొట్టనింపుకునేది. ఒక రోజు అది బాగా పండిన పంటచేలలో జొరబడింది. కనిపించిన కంది గింజల్ని, జొన్న గింజల్ని, సజ్జల్ని ఇలా రకరకాల గింజల్ని కడుపారతింది. అటు తరువాత కొన్ని గింజల్ని ఏరుకుని మూట కట్టుకుని ఊరి చివర ఉన్న ఓ ముసలమ్మ ఇంటికి వచ్చింది. ముసలమ్మను అడిగి ఆమె దగ్గరున్న విసర్రాయిలో తన దగ్గరున్న గింజల్ని విసరుకుంది. ఆ పిండిలో రొట్టె తయారు చేసుకుంది. అయితే అప్పటికే కడుపునిండా గింజలు తినివుండటంతో దానికి ఆకలి కాలేదు. దాంతో రొట్టె తీసుకొని నూలు వొడికే ముసలమ్మ దగ్గరికి వెళ్ళి -"నేను అలా అలా షికారుకు వెళ్ళొస్తాను. అప్పడిదాకా ఈ రొట్టెను నీ దగ్గర దాచిపెట్టు" - అంది. "అలాగే" - అంది ముసలమ్మ. పిట్ట గాలిలో పల్టీలు కొడుతూ ముందుకు సాగింది. కొద్దిసేపటి తరువాత ముసలమ్మకు ఆకలివేసింది. పిట్ట ఇచ్చిన రొట్టెను తినేసింది. సాయంత్రం వల్లంకిపిట్ట తిరిగొచ్చి "అవ్వా! అవ్వా! నా రొట్టె ఇవ్వు”- అంది.