
TILAK SAHITHI SANDARSHANAM
₹240
In stock · 243 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సందర్శనానికి ముందుగా... దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఒక విశిష్ట విలక్షణ సాహితీ సృజనశీలి. కవిత్వం, కథ, నాటక ప్రక్రియల్లో ఉత్తమోత్తమ కృషీవలుడు, కవిత్వంలో వస్తు, రూపాలకు సంబంధించిన విభిన్న రీతుల్లో తానేమిటో తన ప్రత్యేకత ఏమిటో చాటారు. సాహిత్యం పట్ల తిలక్ గారికి ఒక స్పష్టమైన దృక్పథం ఉంది. దానిని చివరికంటా తన రచనల్లో ప్రతిఫలింపజేశారు. తిలక్ మరణానంతరం 1968లో ప్రచురి తమైన "అమృతం కురిసిన రాత్రి" కవితా సంపుటి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. దేవరకొండ బాలగంగాధర తిలక్ 1921 ఆగస్టు 1న జన్మించారు. ఇది 95వ జయంతి సంవత్సరం. 1966 జులై 1న మరణించారు. అంటే తిలక్ మరణించి అర్ధ శతాబ్ది. ఈ ఏడాది (2016) జులై 1న తిలక్ 50వ వర్ధంతి. ఏమిటి, ఎందుకు ? తిలక్ సాహిత్యంపై ప్రముఖ కవులు, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ "తిలక్ సాహితీ సందర్శనం". అంతేకాదు సాహిత్యం గురించి తిలక్ గారు రాసిన కొన్ని వ్యాసాలు, లేఖలు, వారిచ్చిన ఇంటర్వ్యూ కూడా అనుబంధంలో చేరాయి. సాహితీవేత్తలు రాసిన వ్యాసాల్లో అధిక భాగం తిలక్ మరణించినప్పుడు, ఆ తరువాత ప్రచురితమైన స్మృతి సంచికల నుండి సేకరించినవి. అలాగే తిలక్గారి తొలి కావ్యం "ప్రభాతము, సంధ్య" "అమృతం కురిసిన రాత్రి" కవితా సంపుటికి, "గోరువంకలు" పద్య కావ్య సంపుటికి రాసిన ముందుమాటలు, వాటిపై వచ్చిన సమీక్షలు, విశాలాంధ్ర ప్రచురణాలయం నాటి సంపాదకులు నిడమర్తి ఉమారాజేశ్వరరావుగారి తిలక్ కథల పరిచయ వ్యాసం, కథలపై వచ్చిన సమీక్షా వ్యాసాలు ఈ సంకలనంలో చోటుచేసు కున్నాయి. తిలక్ సాహితీ సందర్శనం