
TIRUMALA TIRUPATI DEVASTHANAALA CHARITRAKA NEPADHYAM - PRAJA SAMBANDHALU
₹200
In stock · 314 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Tirumala Tirupati Devasthanaala Charitraka Nepadhyam - Praja Sambandhalu Dr. Thalari Ravi సమగ్ర సమాచార గని “తిరుమల తిరుపతి దేవస్థానాలు చారిత్రక నేపథ్యం - ప్రజాసంబంధాలు" అనే ఈ పుస్తకంలో శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శించి, ఆలయ పాలన బాధ్యతలు చేపట్టిన ఆనాటి చక్రవర్తులు, బ్రిటీషువారు, మహంతులు, ధర్మకర్తల మండలి గురించిన సమగ్ర సమాచారం ఉంది. శ్రీవారి ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, భక్తులకు కల్పిస్తున్న వసతుల గురించి వివరించే ప్రయత్నం జరిగింది. తిరుమల చరిత్రను కళ్ళకు కట్టేలా గత కాలం నాటి ఛాయాచిత్రాలు ఆకట్టుకుంటాయి. పౌరాణిక, చారిత్రక, ఆధునిక కాలాల్లో తిరుమల ప్రస్తావనలు, ఆలయ వ్యవహారాలు ఎలా ఉండేవో, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా విస్తరిస్తూ భక్తులకు చేరువవుతున్నాయో, దేశవిదేశాల నుంచి తిరుమలకు వస్తున్న భక్తులు తిరుపతిలో దిగినప్పటి నుంచి వారికి ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో, నిరంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు స్థానికంగా మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలలా ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ పుస్తకం మీ చేతుల్లో ఉండి తీరాలి. డా॥ తలారి రవి ప్రజాసంబంధాల అధికారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నందువల్ల ఆయన అనుభవాలు ఈ గ్రంథానికి చాలా ఉపయోగపడ్డాయి. శ్రీ తాళ్ళపాక అన్నమయ్య, శ్రీ పురందరదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ లాంటి వాగ్గేయకారులు తమ కీర్తనలు, రచనల ద్వారా సనాతన ధర్మప్రచారం చేసి శ్రీవారి ప్రజాసంబంధాల అధికారుల పాత్ర పోషించారు. ఆ మహనీయుల బాటలో నడుస్తూ డా॥ తలారి రవి రచించిన ఈ పుస్తకాన్ని తితిదే సమగ్ర సమాచార గని అని పిలవడంలో అతిశయోక్తి లేదు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004