TOLSTOY JEEVITHAM by MAHIDHARA RAMMOHAN RAO Telugu book cover

TOLSTOY JEEVITHAM

by MAHIDHARA RAMMOHAN RAO

₹30
In stock · 146 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
బాల్స్టాయ్ జీవితం పరిచయం లియో టాల్స్టాయ్ పూర్తిపేరు "కౌంట్ లియో నికోలేవ్ టాల్స్టాయ్”, “లియో నికోలేవ్" - తల్లిదండ్రులు పెట్టిన పేరు. "టాల్స్టాయ్” వంశమిచ్చిన ఉపనామం. "కౌంట్" అతడు పుట్టిన వంశగౌరవాన్ననుసరించి వచ్చిన బిరుదనామం. రష్యాలో అనేకమంది లియో నికోలేమ్లు అనేక మంది టాల్స్టాయ్లు అనేక మంది కౌంట్లు - పుట్టేరు. కాని "కౌంట్ లియో నికోలేవ్ టాల్స్టాయ్" లేక సంగ్రహరూపంలో "లియో టాల్స్టాయ్” అనే పేరు ఆ ఒక్క మనిషినే, దీనుల్ని, దరిద్రుల్ని పైకి తీసుకురావడానికి తన జీవితం అంతా ధారపోసిన ఆ ఒక్క వ్యక్తినే ప్రపంచానికి జ్ఞాపకం చేస్తుంది. ధనం, అధికారం కొరకెంతెంత దురంతాల కైనా వెనుదీయని జమీందారీ కుటుంబంలో లియో టాల్స్టాయ్ పుట్టేడు. కాని, జమీందార్ల చెడుగుణాలేవీ అతనికి సంక్రమించలేదు. ధనం వున్నదని ఎవ్వరినీ తృణీకరించలేదు. అధికారం ఉన్నదని ఒక్కళ్ళనీ బాధించలేదు. దరిద్రుల్నీ, అసహాయుల్నీ రక్షించడానికై తోడి జమీందార్లతో జీవితం అంతా పోరాడి కీర్తిపొందిన మహానీయుడు టాల్స్టాయ్. తనకున్న ధనం అంతా దరిద్రులికి సాయం చెయ్యడంలోనూ, శక్తి అంతా నిస్సహాయులైన ప్రజలకు సాయం చెయ్యడంలోనూ, జీవితమంతా ప్రపంచానికి మంచిమార్గం చూపడంలోనూ వినియోగపరచిన స్వార్ధత్యాగి. అతడు మనుష్యహృదయ మెరిగిన జ్ఞాని. వాజ్మయ తత్త్వ మెరిగిన పండితుడు. కళారహస్య మెరిగిన కవి. అతని భావాలు హృదయాన్ని చూరగొంటాయి. అతని రచన మనస్సున ఉత్సాహమిస్తుంది. కల్పన మిక్కిలి సహజంగా ఉంటుంది. మనుష్య జీవితంలోని ప్రతీ చిన్న ఘటనకీ కళారూప మీయగల ఉత్తమ రచయిత, టాల్స్టాయ్. అతని రచనా వైవిధ్యం ప్రపంచ హృదయాలను ఆకర్షించింది. అతని విశాల హృదయం వాటిలో స్థిరనివాసం ఏర్పరుచుకుంది. అనేక మంది ప్రజలు తినడానికి ఒక్క రొట్టెనా లేక అల్లాడి పోతుంటే కొద్దిమంది ముప్పొద్దులా విలువైన తిండి తింటుండడం, వేలకొద్దీ జనం చలికి ఆగే బట్టైనా లేక బాధపడుతుంటే కొంతమంది ఒక్కొక్క బట్టకై వేలకొలది రూపాయలు ఖర్చు పెట్టడం,