TRIMURTHULA ASADARANA KATHALU by SUDHAMURTHY Telugu book cover

TRIMURTHULA ASADARANA KATHALU

by SUDHAMURTHY

₹150
In stock · 4 available
PublisherALAKANANDA PRACHURANALU
LanguageTelugu
పరిచయం భారతదేశంలో 'త్రిమూర్తి' అనే పదంతో దేవుడి మూడు ముఖాలు వర్ణిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను త్రిమూర్తిగా పిలుస్తారు. : వారు ప్రజలు కోరిన వరాలు ఇచ్చే శక్తిమంతులై తమ విశిష్టతను చాటుకుంటూ విశ్వం యొక్క ఏకత్వానికి ప్రతీకలుగా విలసిల్లుతున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ ఆలయాలలో, గృహాలలో మంత్రోచ్చాటన ద్వారా అనేక కథల ద్వారా కీర్తింపబడుతున్నారు. అయినా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అనేక ఆలయాలు శివునికి, విష్ణువుకు అతని పలు అవతారాలకు నెలకొల్పారు. కాని త్రిమూర్తులలో సమాన ప్రాధాన్యం కలిగిన బ్రహ్మకు ఆలయాలు ఎందుకు లేవు. అసురులు అంటే ? రాక్షసులు త్రిమూర్తులను మోసగించడానికి జన్మరాహిత్యం కోసం ఎందుకు పలుమార్లు ప్రయత్నించారు? వారి ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి? సరస్వతి, లక్ష్మి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులు. కాని పార్వతి శక్తి, దుర్గగా, యుద్ధ దేవతగా పలు అవతారాలు దాల్చింది. మరి లావణ్య సుందరమూర్తి అయిన పార్వతి అరివీర భయంకరిగా ఎలా పిలవబడింది? ఇది భారత పురాణాలపై ముందు తరాల పాఠకులకు నేను వ్రాసిన రెండవ సంకలనం. ఈ పుస్తక రచనలో ప్రధాన పాత్ర వహించిన నా సంపాదకురాలు శ్రుతకీర్తి ఖురానాకు, అంజు కులకర్ణిలకు ధన్యవాదాలు. పెంగ్విన్కు చెందిన సోహిని మిత్రా, హేమాలి శోఢిలు అందించిన సహకారానికి, నా మీద వారి నమ్మకానికి ఋణపడి ఉంటాను.