
TRISATHI
₹50
In stock · 412 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400859
TRISATHI by ILLA MURALIDHARA RAO గతంలో అమ్మనాన్నల గూర్చి, అతిథుల గూర్చి, విద్య గూర్చి, మూఢనమ్మకాల గూర్చి, పద్యరచన - పద్యకవుల గూర్చి ఇప్పటికి సప్తశతకాలను వెలయించగా మా ఆచార్యవర్యులొకరు పిలిచి 'మీ కవులందరకూ భార్యంటే చిన్నచూపా?' అని నిలదీశారు. ఒక స్త్రీ భార్యగా నిర్వర్తించే బాధ్యతలను, గృహిణియొక్క పూర్తి స్థాయి విశ్వరూపాన్ని వర్ణించగలగడం ఎవరితరం? స్త్రీజాతికి నావంతుగా కాస్తయినా కృతజ్ఞత చెల్లించాలనిపించింది. అంతే! మూడు రోజుల్లో 'భార్యాశతకం' సిద్ధమైంది. అన్నీరాసి 'ఆటవెలది' ఏ పాపం చేసుకుందని నాకే అనిపించింది. వేమన గారి ఏకలవ్య శిష్యరికంతో 'ముద్దుమూటలు' జాలువారాయి. పద్యరచన కష్టమో కాదో తెలియదు కానీ, 'సమస్యాపూరణ' మాత్రం కత్తిమీద సామే. ఆ సాము కూడా కాస్త పట్టుబడాలని పట్టుబట్టి వంద చిత్రమైన సమస్యలను పూరించబోయాను. ఇలా రూపుదిద్దుకున్న ఈ మూడు శతకాలూ రసజ్ఞుల ఆదరాభిమానాలకు నోచుకోగలవని నమ్ముతున్నాను. విజ్ఞులైన పాఠకుల దీవెనలు, సూచనలు, సలహాలను ఆశిస్తూ.... ఇళ్ళ మురళీధరరావు